ధర్మపురి లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు.

ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నంది విగ్రహం వద్ద టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి కి వివిధ శాఖల మంత్రులకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు..


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు