ధర్మపురిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణం నంది చౌక వద్ద కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు.

ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ విప్ గా నియమిచడాన్ని స్వాగతిస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి. శ్రీమతి కాంత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.