ధర్మపురిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు మిఠాయి పంపిణీ….

J.SURENDER KUMAR,

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శనివారం ధర్మపురి పట్టణంలోని నంది విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.


మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్థానిక నంది విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, మహిళా కౌన్సిలర్లు, కేక్ కట్ చేసి, మిఠాయి పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా స్థానిక బస్టాండ్ లో మిఠాయిలు పంచిపెట్టారు. మహిళలకు మంగళవారం చూడకు బస్సులోకి స్వాగతించారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
.