J.SURENDER KUMAR,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు ఆ పదవి అచ్చి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు చెప్పుకోవచ్చు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ లు గా 1-12-1959 నుంచి. 4-07-2019 వరకు ( ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి చైర్మన్ తుల ఉమా ) 13 మంది కొనసాగారు. ఇందులో లక్ష్మణ్ కుమార్ తో కలిపి ఐదుగురి కి ఎమ్మెల్యే పదవులు వరించాయి.
మాజీ మంత్రి చొక్కా రావు, సాయి రెడ్డి, సుద్దాల దేవయ్య, ఆరేపల్లి మోహన్, ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. సిహెచ్ విజయ రంగారావు, జి .హనుమంతరావు, ఏ. శ్రీనివాసరావు , పి కిషన్ రావు, కె.వి రాజేశ్వరరావు, తీగల రవీందర్ గౌడ్, తుల ఉమా లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ లుగా కొనసాగారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవులు అనుభవించిన వారు 2014 వరకు 14 మంది ఉండగా అందులో ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఉన్నారు.1959లో స్వర్గీయ మాజీమంత్రి జువ్వాడి చొక్కరావు 1967 వరకు కొనసాగారు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవడంతో పాటు రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు. హుజురాబాద్ కు చెందిన స్వర్గీయ సాయి రెడ్డి 1983 నుంచి 1986 వరకు జడ్పీ చైర్మన్ గా కొనసాగారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మాజీమంత్రి సుద్దాల దేవయ్య 1987 నుంచి 1992 కొనసాగారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ 2006 నుంచి 2009 వరకు కొనసాగారు అనంతరం ఆయన ఎమ్మెల్యే గెలిచి నాటి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కొనసాగారు.
2009 నుంచి 2011 వరకు లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ గా కొనసాగి. 2023 లో ఎమ్మెల్యేగా గెలిచారు.
మంత్రిగా విధులు నిర్వహించి.. చైర్మన్ గా !
మాజీమంత్రి రాజేశం గౌడ్ 1985 నుంచి 1989 వరకు ఎన్టీఆర్ ప్రభుత్వం లో మంత్రిగా కొనసాగిన రాజేష్ గౌడ్. 20-03-1995 నుంచి 19-03-2000 వరకు ఆయన జడ్పీ చైర్మన్ గా కొనసాగారు.