ధర్మపురి నరసింహుడి మొక్కు తీర్చుకున్న తీన్మార్ మల్లన్న !

J.SURENDER KUMAR,

చింతపండు నవీన్ @ తీన్మార్ మల్లన్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మొక్కును తీర్చుకొని గోదావరి నదిలో దీపాలు వదిలారు.

వివరాల్లోకి వెళితే…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం ఎండపల్లి మండలం రాజారామ్ పల్లెలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మణ్ కుమార్ భారీ ఓట్లతో గెలిపించాలని, ప్రత్యర్థి అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద మొత్తంలో ఓటర్లకు డబ్బులు ఇస్తాడని, కారు గుర్తుకే ఓటు వేస్తా అని ఓట్టు పెట్టుకోమని వాళ్ళు అంటారు అని అన్నారు.

మీరు తీన్మార్ మల్లన్న పై ఒట్టు పెట్టుకొని డబ్బులు తీసుకున్న తప్పులేదన్నారు. ఎన్నికల తర్వాత నాపై మీరు పెట్టుకున్న ఓట్లన్నీ నేను ధర్మపురికి వచ్చి గోదావరి నదిలో వదిలి పెడతానని ప్రచార సభలో మొక్కుకున్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి చెంది, లక్ష్మణ్ కుమార్ విజయం సాధిస్తే, మహిమాత్మా గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నీ దర్శించుకుని 101 కొబ్బరి కాయలు కొట్టుతానని బహిరంగ సభలో ఆయన మొక్కుకున్నారు.

ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ముందుగా గోదావరి నది కి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ అధికారులు మల్లన్న స్వామి వారి శేష వస్త్రం ప్రసాదం అందజేశారు. ఆలయ రాజగోపురం ముందు 101 కొబ్బరికాయ మల్లన్న కొట్టి మొక్కు తీర్చుకున్నారు.