👉గొల్లపల్లి విజయోత్సవ ర్యాలీలో…
👉ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా పని చేస్తూ రుణం తీర్చుకుంటాను అంటూ స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శాసనసభ్యుడిగా ఎన్నికై మంగళవారం మొట్టమొదటిసారి గొల్లపల్లికి మండలానికి లక్ష్మణ్ కుమార్ చేరుకొని విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులతో స్వాగతం పలికారు.

యువకులు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో నృత్యాలు చేశారు.. అనంతరం పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలోని అభినందన సభ జరిగింది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల లోపల రెండు పథకాలు ప్రారంభించడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానన్నారు.
👉వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడవద్దు !

మంగళవారం జరిగిన ధర్మారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఐకెపి కేంద్రాల వద్ద వరి ధాన్యం కొనుగోలు లో ఏలాంటి అవకతవకలు జరగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరారు.

త్వరలో వివిధ శాఖల శాఖల సంబంధిత అధికారులను. వారి వారి శాఖల వారీగా ఉన్న ప్రణాళికలను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించ నున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.