👉అడ్లూరి కాంతా కుమారి లక్ష్మణ్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నా భర్త , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, తల్లులకు,అక్కలు చెల్లెళ్లకు, అన్నదమ్ముల కు, రైతాంగానికి, యువతీ యువకులకు లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతా కుమారి ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల సమయంలో నా భర్తకు, నా కుటుంబ సభ్యులకు, అండగా నిలిచి మీకు మేమున్నామంటూ, మాలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, నింపి విజయ తీరాలకు చేర్చి ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి న మీ సహాయ సహకారాలు, మా పట్ల చూపిన ప్రేమ ,అనురాగాలు, ఆప్యాయతలు మా కుటుంబం జీవితాంతం మరిచిపోలేము. అనీ ప్రకటనలో పేర్కొన్నారు. మీ రుణం మేము ఈ జీవితాంతం తీర్చుకోలేనిది. అనుక్షణం ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకానికి సేవలు చేస్తామని వినయ పూర్వకంగా మనవి చేస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు మీరు మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
నిద్రహారాలు లేకుండా లక్ష్మణ్ కుమార్ గెలుపే లక్ష్యంగా కృషిచేసిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతిని కార్యకర్తలు అభిమానులకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.