👉నేను ఈ స్థాయికి నిప్పుల్లో నడిచి వచ్చా..!
👉సౌమ్యుడు, మెత్తటి మనిషి, అనుకుంటారు కానీ అవన్నీ పక్కన పెడితే.. ఏదైనా చేయగలను!
👉రానున్న రోజుల్లో స్థానిక పార్లమెంట్ ఎన్నికల రూపం లో పరీక్షలు రాబోతున్నాయ్ !
👉మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం ఎన్నికల ఫలితాల తర్వాత ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నృసింహ గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తలు కృతజ్ఞత సభ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కార్యకర్తలు కొప్పుల ఈశ్వర్ కు విషాద వదనంతో స్వాగతించారు.
ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాటలు..
👉నేను ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తాను,ధర్మపురి బిఆర్ఎస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతీ కార్యకర్త తానే అభ్యర్థి అనుకుని పని చేశారు.
👉దురదృష్టశావత్తు నేను ధర్మపురి నియోజకవర్గం శాసన సభ్యుడగా ఓడిపోవడం జరిగింది అలాగే రాష్ట్రం మనం అధికారం కోల్పోయాం..బీ ఆర్ ఎస్ కు ఒడిదొడుకులు కొత్త కాదు
👉రానున్న రోజుల్లో స్థానిక పార్లమెంట్ ఎన్నికల రూపం లో పరీక్షలు రాబోతున్నాయ్ వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి పకడ్బందీ కార్యాచరణతో ముందుకు పోదాం…

👉కేసీఆర్ పాలన లో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది, కాంగ్రెస్ పార్టీ మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారు
👉దుష్ప్రచారం కూడా కొంత పై చేయి సాధించింది బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమే తెలంగాణ తెచ్చిన పార్టీ బీ ఆర్ ఎస్ ..గెలిచినప్పుడు పొంగి పోలేదు ..ఓటమి తో కుంగి పోలేదు
👉కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ తరుపున, నా తరపున కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కూడా నాదే అని కొప్పుల ఈశ్వర్ వారికి భరోసా ఇచ్చారు.
👉తాను సౌమ్యుడు, మెత్తటి మనిషి, అనుకుంటారు కానీ అవన్నీ పక్కన పెడితే.. ఏదైనా చేయగలను..తాను ఇన్ని సార్లు ధర్మపురి నియోజకవర్గం లో గెలిచిన ఎవరినీ నొప్పించలేదని కొప్పుల ఈశ్వర్ ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు..
👉ధర్మపురి నియోజకవర్గం ప్రజల కోసం పనిచేస్తానని, తాను ఈ స్థాయికి అంత సులువుగా రాలేదని నిప్పుల్లో నడిచి వచ్చాని కొప్పుల గుర్తు చేశారు కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాం వాళ్ళిచ్చిన హామీల అమలు లో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదాం..
👉ధర్మపురి లో మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నించారు ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందాం మనకు పోరాటాలు కొత్త కాదు ..భవిష్యత్ మనదే కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందిప్రభుత్వంలోకి రాలేమన్న బాధ ఉన్నా ..ఇక కార్యకర్తలు దాన్ని మరచిపోవాలి
👉రాజకీయాల్లో జయాపజయాలు సహజం
బీ ఆర్ ఎస్ త్యాగాల పార్టీ ..పదవులను గడ్డి పోచల్లా వదలి పెట్టాం కొన్ని రోజుల్లోనే ఏది మంచో ఏది చెడో ప్రజలు గ్రహిస్తారు బీఆర్ఎస్ పాలక పక్షం లో ఉన్నా విపక్షం లో ఉన్నా ఎపుడూ ప్రజల పక్షమే కష్టపడి పని చేద్దాం ..కలసి కట్టుగా మళ్ళీ విజయం సాధిద్దాం
👉పార్టీ లో సీనియర్ల సేవలు ,కార్యకర్తల సేవలను తగిన విధంగా వాడుకుంటాం
పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేద్దాం
ప్రజలకు ఇబ్బందులు కలిగినపుడు వారి వెంట బీ ఆర్ ఎస్ కచ్చితంగా ఉంటుంది.

👉రేపు వాళ్లు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు అందులో ఉండే కష్ట నష్టాలు తెలుస్తాయి ఆచరణ సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ వాళ్లు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోస పోయాము అనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు
👉నాలుగు ఐదు నెలలో ప్రజలకు నిజం తెలుస్తుంది. ప్రజలకు అర్థం అయ్యే వరకు జరిగే నష్టం మొత్తం జరిగిపోతుంది.
👉ప్రజలకు ఏం చేస్తారు అని చెప్పకుండా వ్యక్తిగత కక్షలతో ఉన్నవారు విజయాలను సాధించలేరు ఫలితాలను సమీక్షించుకుంటాం .. ప్రజల కోణం తెలుసుకుంటాం.
నియోజకవర్గం లో పార్టీ కోసం పని చేసిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరికి మాజీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు