ధర్మపురి రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఉద్యోగికి గాయాలు.!

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారి పై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ కు చెందిన జూనియర్ లైన్మెన్ నరెడ్ల గంగాధర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానిక అంబేద్కర్ చౌరస్తా మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గంగాధర్ ను గూడ్స్ వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రాథమిక వైద్య చికిత్స అందించి 108 అంబులెన్స్ లో కరీంనగర్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సతీమణి, కాంత కుమారి ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రి యాజమాన్యంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రస్తుతం గంగాధర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.