జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష..
J.SURENDER KUMAR,
దివ్యాంగులు సామాజికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఎలాంటి వివక్షతలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది. అని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అని అన్నారు.
దివ్యాంగులకు చట్టపరంగా ఉన్న అన్ని హక్కులను మరియు అన్ని పథకాలను అందించే దిశ, ప్రభుత్వ ఆదేశానుసారం దివ్యాంగుల కన్వర్జేన్సీ కమిటీని ఏర్పాటు చేసి సంబంధిత శాఖ అధికారులతో దివ్యాంగుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి దివ్యాంగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై చర్చించి త్వరితగతిన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.

ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రం నందలి మినీ స్టేడియంలో సోమవారం దివ్యాంగులకు క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు మార్గదర్శకాలను నిర్దేశించడం జరిగింది, 1995 దివ్యాంగుల చట్టం ప్రకారం ఏడు రకాల దివ్యాంగులను, 2016 దివ్యాంగుల చట్టం నందు 21 రకాలుగా గుర్తించడం జరిగింది,

ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని అన్ని రకాల దివ్యాంగులను ఏకం చేసి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి క్రీడల ద్వారా దివ్యాంగులకు మానసిక ఉల్లాసాన్ని మనోధైర్యాన్ని నింపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు వివిధ భాగాలలో క్రీడలు చెస్సు, క్యారం బోర్డు, పరుగు పందెం, షాట్ పుట్టు మొదలగు క్రీడలు ఆడిపించి విజేతల కు రేపు జరగబోయే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు బహుమతులు అందజేయడం జరుగుతుందని, రేపటి దివ్యాంగుల దినోత్సవం లో కార్యక్రమంలో భాగంగా వికలాంగులు రక్తదాన శిబిరం మరియు హెల్త్ చెకప్ శిబిరం అదేవిధంగా మెడల్స్ గెలిచిన వారికి అందించబడనని జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ అడేపు భాస్కర్ ని కలెక్టర్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ ఆడెపు భాస్కర్, డి ఎస్ డి ఓ , డి పి ఎం , సీనియర్ అసిస్టెంట్ చంద్రమోహన్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్స్ కొండయ్య, పాదం. తిరుపతి, దివ్యాంగుల సంఘ నాయకులు బండి సత్యనారాయణ, లంక దాసరి శ్రీనివాస్, అఙ్గర్ మహమ్మద్ ఖాన్, అబ్దుల్ అజీజ్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు వివిధ మండలాల నుండి విచ్చేసిన దివ్యాంగులు పాల్గొన్నారు.