👉కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో…
👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
👉సీఎం కార్యాలయ ప్రకటనలో..
J.SURENDER KUMAR,
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ.. మిగతా వివరాలు మాట్లాడదలుచుకున్నా.. అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.. అద్దాల మేడలు కట్టో.. రంగుల గోడలు చూపించో.. అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదివారం జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి లతో సమావేశం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి నిర్వహించారు.
నిజమైన అభివృద్ధి అనేది పౌరులయొక్క సమగ్రాభివృద్ధి జరిగినప్పుడే… చివరి వరుసలో వున్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్లు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ.. అందుకే ఈరోజు చివరి వరుసలో నిలబడ్డ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వుండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయవలసిన వారధి మీరే సీఎం అన్నారు. మీమీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయో ఆరు గ్యారంటీలను దానికి సంబంధించి వినతిపత్రాలను, అప్లికేషన్లను తీసుకోవాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అన్నారు.
ఎస్ ఆర్ శంకరన్, ఐఏఎస్… గూర్చి..

అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అఖిల భారత సర్వీసెస్ అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ, మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్.ఆర్. శంకర్ గారు, అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంకర్ గారి జీవితకాలం సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతీ పైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారు. అతను అఖిల భారత సర్వీసెస్ అధికారులకు ఒక ఆదర్శప్రాయమైన అధికారిగా నిలబడ్డవాడు ఎస్.ఆర్. శంకరన్ గారు. వీరు ప్రతిరోజు ఉదయం విధులకు ముందు ఎస్ఆర్ శంకర్ ను గుర్తు తెచ్చుకుంటే తప్పకుండా మన విధానంలో మార్పు వస్తుంది అని సీఎం అన్నారు. ప్రజలకు అది ఉపయోపడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ‘పద్మభూషణ్ ‘ అవార్డు ఇస్తే కూడా వారు సున్నితంగా తిరస్కరించారు. సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతం, ఇలాంటివి నేను ఆశించను. నేను నా బాధ్యత నెరువేరుస్తానని ఎస్.ఆర్. శంకరన్ గారు వినయంగా, వినమ్రతతో కేంద్ర ప్రభుత్వ పద్మభూషన్ అవార్డు తిరస్కరించడం ద్వారా వారు గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కొత్ర ప్రభుత్వం తరపున మీకందరికి స్వాగతం పలుకుతున్నా.. ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే.. అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలి అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం వుంటుంది. ఇందులో ఏది కూడా కాస్త వెనుకా ముందు చేసినా సరైన పనులు చేయకపోయినా.. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో ఇచ్చిన గారంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్లది, పోలీస్ అధికారులది అన్నారు.
పత్యక్షంగా ప్రజలతో సంబంధాలు వుండాల్సినవాళ్లు, వుండే వాళ్లు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అందుకే ఈ రెండు ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలని ఆలోచనతో, ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది అని సీఎం అన్నారు. ఈ వీడియో సమావేశంలో. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ఫైనాన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితెందర్, సీనియర్ ఐఎఎస్ అధికారులు నవీన్ మిట్టల్, దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, సయ్యద్ అలీ ముర్తుజా, కె. ఎస్. శ్రీనివాసరాజు, రాహుల్ బొజ్జా, శ్రీమతి క్రిష్టినాజడ్ చోంగ్తూ, రఘునందన్ రావు, రోనాల్డ్ రాస్, శ్రీమతి హరిచందన దాసరి, హనుమంతరావు, కె. అశోక్ రెడ్డి, వి. అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.