ఫ్లాష్. ఫ్లాష్. 54 మంది చైర్మన్ లకు ఉద్వాసన !


ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!


J.SURENDER KUMAR,

మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం లో నియామకం జరిగిన వివిధ కార్పొరేషన్ల కు చెందిన 54 మంది చైర్మన్ లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివారం ఉద్వాసన పలికింది.

జీవో నెంబర్ సంఖ్య 1624, ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం జారీ చేసిన ఉత్తర్వులలో పదవీకాలం పొడిగింపు జరిగిన, పదవీకాలం పూర్తి కానీ వారిని సైతం, తొలగిస్తూ జీవోలో పేర్కొనబడింది. ఈ ఉత్తర్వులు ఈనెల 7 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు.

ఆయా చైర్ పర్సన్ ల తో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ లో ఉన్న P.A. P.S, OSD. తొలగిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే, సంబంధిత శాఖ ఉన్నతాధికారికి వారు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ సలహాదారులను తొలగించిన విషయం తెలిసిందే.