👉 సీఎం కార్యాలయ ప్రకటనలో.
J.SURENDER KUMAR,
రాష్ట్ర శాసన సభ, శాసన మండలినుద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్ర శాసన సభకు శుక్రవారం విచ్చేసిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్ కు ఘన స్వాగతం పలికారు.

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు.
అనంతరం, మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ లు గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు సాదరంగా తీసుకువెళ్లారు.

జాతీయ గీతాలాపన అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.