J.SURENDER KUMAR,
హుజురాబాద్ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో. నెలకొన్న సంస్కృతి.. శుక్రవారం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ కు వ్యాపించింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
గత నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలలో 119. స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ధర్మపురి మండలం నక్కల పేట గ్రామానికి చెందిన కొందరు ఓటర్లు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

పోలింగ్ నేపథ్యంలో కొందరు ఓటర్లుకు, వారి కుల సంఘానికి. అధికార పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వరు అంటూ నినాదాలు చేశారు.. కొందరు గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని నచ్చ చెప్పడంతో వారి ఆందోళన తాత్కాలికంగా విరమించినట్టు సమాచారం.