👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్..
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో మేము పాలకులము కాదని, ప్రజా సేవకులమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు
గురువారం రోజున ధర్మపురి మునిసిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజలకు చేసిన వాగ్దానాలను వంద రోజుల్లో అమలు పరచడం జరుగుతుందని, పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలకు అందించడానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయణం, ఆరోగ్య శ్రీ పథకం క్రింద ₹10 లక్షల వరకు వైద్య చికిత్సలు అందించడం ఫైల్ పై సంతకం చేశామని తెలిపారు. వంద రోజుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను అమలు పరుస్తామని వివరించారు. ఇచ్చిన మాటలను అమలు పరుస్తూ, సూచనలు కూడా అందిస్తూ, ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి సహకరించాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజల ముంగిట్లో ప్రభుత్వ అధికారులు రావడం జరుగుతున్నదని అన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలిపారు. మునిసిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకొని సద్వినియోగ చేసుకోవాలన్నారు.

అంతకు ముందు పలువురు మహిళలకు దరఖాస్తు ఫారాలను అందజేసి, లబ్ది దారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నియోజక వర్గం ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి కె.లక్ష్మి నారాయణ, కార్యక్రమంపై వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ రమేష్, వైస్ చైర్మన్ రామన్న, మండల ప్రత్యేక అధికారి రోహిత్ , కౌన్సిలర్స్, అధికారులు, లబ్దిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వెల్గటూర్ మండలం…

నియోజకవర్గంలోని వెల్గటూర్ మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ భవనంలో ప్రజా పాలన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.ధర్మారం మండలం..

ధర్మారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ప్రజా పాలన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కోరారు. పథకాల పట్ల ప్రజలకు ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంది అని అన్నారు.
బుద్దేష్ పల్లె..

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుద్దేష్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎడ్ల చిట్టిబాబు, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ సందర్శించి, దరఖాస్తు స్వీకరణ విధానాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, గ్రామ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
దుబ్బల గూడెం…

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా దుబ్బల గూడెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను, మండల పంచాయతి నరేష్, సర్పంచ్ దత్తూరి నర్సయ్య, ఉప సర్పంచ్ ఏదుల బుచ్చన్న, పంచాయతీ కార్యదర్శి నునావత్ రాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ కుసుమ , ఆశ సుమ అంగన్వాడి కార్యకర్త లక్ష్మి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.