J.SURENDER KUMAR,
జగిత్యాల డివిజన్ మావోయిస్టు మాజీ దళ కమాండర్ గడ్డం సమ్మయ్య, అలియాస్ జోగన్న శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు.
జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జోగన్న దశాబ్దన్నర కాలం పాటు జగిత్యాల్ డివిజన్ దళ కమాండర్ గా పని చేశారు. నేరెళ్ల మందు పాతర సంఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు దుర్మరణం చెందిన ఉదంతంలో జోగన్న పాత్ర కీలకం. బైరి రామచంద్రం అలియాస్ భీమన్న జగిత్యాల డివిజన్ దళనాయకుడిగా కొనసాగిన కాలంలో జోగన్న కమాండర్ గా పని చేశాడు. 2000 సంవత్సరం లో. భీమన్న దంపతులు ప్రభుత్వానికి లొంగి జనజీవన స్రవంతిలో చేరారు.

ఇదే సంవత్సరం జనవరి మాసంలో తాళ్ల ధర్మారం గ్రామంలో జోగన్న స్థావరంపై జగిత్యాల డివిజన్ పోలీసులు మెరుపు దాడి చేసి జోగన్న ను అరెస్టు చేశారు. ఇతని స్థావరంలో తుపాకులను స్వాధీనం చేసుకొని జైలుకు తరలించారు. అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపిన జోగన్న జైలు నుంచి బయటికి వచ్చి గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి మృతిచెందగా నమ్మిన సిద్ధాంతం కొరకు కడదాకా విప్లవక జీవితాన్ని గడిపిన జోగన్న అలియాస్ గడ్డం సమ్మయ్య అనాధగా అనారోగ్యంతో మృతి మృతి చెందడం నాకీ ఆయన సానుభూతిపరులు సంతాపం వ్యక్తం చేశారు.