J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో గురువారం ప్రారంభమైన ప్రజా పాలన మొదటి రోజున జిల్లా వ్యాప్తంగా 30,249 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్ విడుదల చేసిన ప్రకటనలు పేర్కొన్నారు.
మొదటి రోజున 57 గ్రామ పంచాయతీలు, 134 మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలోని 33077 గృహాలు, మున్సిపల్ వార్డులలోని 74357 గృహాల నుండి ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు.