జగిత్యాల జిల్లాలో రైస్ మిల్లులో వేలాది క్వింటాళ్ల ప్రభుత్వ ధాన్యం మాయం !

👉అధికారుల దాడుల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు !

👉సీఎంఆర్ ధాన్యం మాయంపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలెక్టర్ కు ఫిర్యాదు

👉”ఉప్పు” వార్తా కథనం ఎఫెక్ట్..

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలో కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ ( CMR) ప్రభుత్వ ధాన్యం నిలువలపై  అధికారుల బృందం గత రెండు రోజులుగా (మంగళవారం, బుధవారం) నిర్వహించిన దాడులలో కోట్లాది రూపాయలు విలువగల వేలాది క్వింటాళ్ల ధాన్యం నిల్వల కు, ప్రభుత్వం కేటాయించిన ధాన్యంకు వ్యత్యాసం ఉన్నట్టు సమాచారం.  ‘రైస్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం నిల్వలు ఉన్నాయా ‘ శీర్షిక ఈనెల 17న ఉప్పు లో వార్త ప్రచురితమైంది. దీనికి తోడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మంగళవారం కలెక్టర్ ను కలిసి రైస్ మిల్లు లలో సీఎంఆర్ ధాన్యం నిలువలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఏర్పడి అధికారులు దాడులు చేస్తున్నట్టు సమాచారం. బుధవారం కోరుట్ల, కథలాపూర్ మూడు మిల్లులలో అధికారులు దాడులు నిర్వహించగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిలువలకు దాదాపు 57 వేల క్వింటాళ్ల ధాన్యం వ్యత్యాసంను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ధాన్యం విలువ దాదాపు ₹14 కోట్ల రూపాయల విలువ ఉంటుందని సమాచారం. జగిత్యాల రూరల్ కల్లెడ గ్రామ శివారు ప్రాంతంలో ఓ మిల్లులో దాడులలో 12,700 ( పన్నెండు వేల ఏడు వందల ) క్వింటాళ్ల ధాన్యం వ్యత్యాసంను అధికారులు గుర్తించినట్టు సమాచారం. బుధవారం నాటికి జిల్లాలో దాదాపు 25 రైస్ మిల్లులలో  దాడులు జరిగినట్లు సమాచారం. వెలుగు చూసినా వివరాల నివేదికను బుధవారం సాయంత్రం ప్రభుత్వానికి అప్పగించినట్టు అధికారులు సమాచారం.

రైస్ మిల్లులో ధాన్యం నిలువల వివరాలు ఇలా ఉన్నాయి!

జగిత్యాల జిల్లాలో 63 బాయిల్డ్, 75 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం ఖరీఫ్ రబీ సీజన్ ల లో కేవలం 60 రైస్ మిల్లులకే ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం కేటాయించింది. 2022-23 నాటికి బాయిల్డ్ రైస్ మిల్లులకు 4840, ACKs కేటాయించిన ధాన్యంలో  ( ఒక్క ACKs 280 క్వింటాల్ ఇది సివిల్ సప్లై వాళ్లు కోడ్ బాష) ప్రభుత్వానికి వారు చెల్లించింది 3398.ACKs. బకాయి పడిన బియ్యం చెల్లించాల్సింది 1442 ACks. రా రైస్ మిల్లులు 2970 ACKs  చెల్లించాల్సి ఉండగా 1674. ACKs చెల్లించారు. బకాయి పడిన బియ్యం 1296 ACKs.. చెల్లించాల్సి ఉంది. జిల్లాల మొత్తం 60 రైస్ మిల్లుల నుంచి 2739 ACKs ప్రభుత్వానికి చెందాల్సి ఉంది. ఈ వివరాలు డిసెంబర్ 12 నాటి వరకే. ఈ నెల 31 లోగా బకాయి ఉన్న 35 శాతం CMR బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది.
ఇందులో 28  రైస్ మిల్లు 100%. 9 రైస్ మిల్లు 90% కు పైగా బియ్యం చెల్లించారు. జగిత్యాల రూరల్ ఓ రైస్ మిల్ 292 ACKs చెల్లించాల్సి ఉండగా కేవలం 10 శాతం చెల్లించారు. బుగ్గారం 13%. జగిత్యాల రూరల్ 15% మాత్రమే ప్రభుత్వానికి అప్పగించారు. రాయికల్, మల్లాపూర్, కోరుట్ల కొన్ని రైస్ మిల్లులు ప్రభుత్వానికి డిసెంబర్ 12 నాటికి ఒక కిలో బియ్యం సైతం అప్పగించలేదని రికార్డులలో నమోదయింది.