కలిసికట్టుగా కార్యకర్తలు కష్టపడ్డారు లక్ష్మణ్ కుమార్ ను గెలిపించుకున్నారు!

J.SURENDER KUMAR,

ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్  రాజకీయాల్లో  ఆయా రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు. వారు మార్గదర్శకులు, అధికార పార్టీ  బెదిరింపులకు, అదరలేదు, బెదరలేదు తమ నాయకుడు 2009 నుంచి వరుసగా ఓటమి చెందుతున్న, ఆర్థికంగా బలహీనుడైన వారు అతడిని వదలి వేరే పార్టీలో చేరలేదు. కసిగా కలిసి కట్టుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి  పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ ను భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, సిట్టింగ్  మంత్రి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి పోటీపడ్డారు. అధికార పార్టీకి చెందిన మంత్రికి ఎదురొడ్డి లక్ష్మణ్ కుమార్ కు గెలుపు కోసం ప్రచారం చేస్తున్న తమకు, తమ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో  ఏలాంటి ఇబ్బందులు పెడతారో అనే ఆలోచన లేకుండా అధైర్య పడకుండా వాడవాడనా ఇంటింటికి గ్రామాల్లో 24/7 ప్రచారం నిర్వహించి లక్ష్మణ్ కుమార్ ను గెలుపు కోసం కృషి చేశారు.

ప్రత్యేకంగా మహిళా కౌన్సిలర్లు, తమ పిల్లలను అత్తలకు, తల్లులకు, వంట వార్పు బాధ్యతలను వారికి అప్పగించి ప్రచారంలో పాల్గొన్నారు. మహిళ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు వాడ వాడకు ఇంటింటికి,  బస్టాండ్ , కూరగాయల మార్కెట్లో, దుకాణాలలో గడపగడపకు తిరుగుతూ ఈసారి లక్ష్మణ్ కుమార్ ఓటు వేయండి, మమ్మల్ని కాంగ్రెస్ అభ్యర్థి అనుకోండి, మీ పనులు కోసం మమ్మల్ని నిలదీయండి అంటూ చేతులు జోడించి ఓట్ల అభ్యర్థించారు.

ధర్మపురి పట్టణంతో పాటు నరసయ్య , కొరండల్ పల్లె, బుద్దేశ్ పల్లె, ఆక్సాయి పల్లె,  తుమ్మెనాల గ్రామాలలో సైతం మీరు ప్రచారం రాత్రి వరకు నిర్వహించారు.  వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లి ,పెగడపల్లి ,  ఎండపల్లి ,ధర్మారం మండలలా నాయకులు, కార్యకర్తలు, తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి వరకు సమిష్టిగా ప్రణాళిక  భద్రంగా ప్రచారం చేశారు.


👉లక్ష్మణ్ కుమార్ కు ధైర్యం చెప్పారు !
ఎన్నికల ప్రచారం కీలక దశలో నియోజకవర్గంలోని ధర్మారం మండలం సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అధికార పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కలత చెందారు.

దీంతో ముఖ్య నాయకులు కార్యకర్తలు ‘అన్న మీరు ఆందోళన చెందవద్దు, మనం గెలుస్తున్నాం, అంటూ ధర్మారం ,వెల్లటూరు, మండలాల్లో ఉన్న తమ బంధువులకు ఫోన్లో ద్వారా లక్ష్మణ్ కుమార్ కు ఓటు వేయాలి అంటూ అభ్యర్థించారు.

👉వార్ రూమ్ ఏర్పాటు…

ధర్మపురి పట్టణంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల సమాచారం, ప్రచార సరళి, ఆయా గ్రామాల్లో పార్టీ బలం, బలహీనతల తదితర అంశాలు రాత్రి పది గంటల వరకు సమగ్ర సమాచారాన్ని సేకరించేవారు. ఆయా ప్రాంతాలలో సరళీకృత ప్రచారం ఎలా నిర్వహించాలి, ఏ గ్రామాల్లో లక్ష్మణ్ కుమార్ ప్రచారం చేయాలి, అనే కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసి

తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆయా మండలాలు బాధ్యులకు వార్ రూమ్ నుంచి అందించేవారు. ప్రచారం ఉదృతం ఎలా చేయాలి, మహిళా ఆశీర్వాద సభ, మార్ వాక్ ప్రచారం, పాదయాత్ర, షెడ్యూల్ తరువాత ఇక్కడే సిద్ధం చేస్తారు.
భోజనాలు, వాహనాలు, బూత్ ల వారీగా పోలింగ్ ఏజెంట్ ఓటర్ లిస్టు, సిద్ధం చేయడం ఎన్నికల అధికారులతో సంప్రదింపులు ఉత్తర ప్రత్యుత్తరాలు, కాంగ్రెస్ పార్టీ అధినేతల పర్యటనలు ప్రచార సభల పర్యవేక్షణ, ఇతర అంశాల బాధ్యతలను నాయకులకు అప్పగించారు. ప్రతిరోజు ప్రచార ప్రగతి నివేదికలు వార్ రూమ్ కు అప్పగించాల్సిందే . ఓ నాయకుడి మాతృమూర్తి హైదరాబాదు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆ నాయకుడు రాత్రి హైదరాబాద్ కి వెళ్లి ఉదయం ధర్మపురికి వచ్చి ప్రచారంలో పాల్గొనేవారు.
👉లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులు..


ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులు, ఆయన ధర్మపత్ని కాంతా కుమారి, తోబుట్టువులు, మేనకోడలు, తల్లి, బంధువులు, మండలాల వారిగా ఇంటింటికి తిరుగుతూ లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం ఓటర్లను ప్రాధేయపడి, బ్రతిమాలి, ఓట్లను అభ్యర్థించే వారు. అధికార పార్టీ వారు ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ధర్మపురి అసెంబ్లీ.ఓటర్లు మాత్రం, లక్ష్మణ్ కుమార్ 2009 నుంచి వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోతున్న,

నియోజకవర్గంలో జరుగుతూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాట నాయకుడిగా, పార్టీ వీడని కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా గుర్తించడం, ఆర్థిక బలం లేని వాడిగా గుర్తించి భారీ సంఖ్యలో  ఓట్లు వేసి  గెలిపించారు.