మధ్యమానేరు వరద నీటిలో వరదవెల్లి దత్తాత్రేయ ఆలయం !

👉వరదవెల్లి ఆలయ గుట్టను చుట్టిన బ్యాక్​ వాటర్.!

👉నేటితో ముగియనున్న జయంతి ఉత్సవాలు!

J.SURENDER KUMAR,

మహన్విత అరుదైన వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కి నిత్య పూజలు కరువయ్యాయి.
దత్తాత్రేయ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 25 నుంచి 27 వరకు, స్వామివారికి పూజలకు, భక్తుల దర్శనార్థం ఆలయ నిర్వాహకులు పడవ సదుపాయం కల్పించడంతో స్వామివారికి పూజా భాగ్యం, భక్తులకు దర్శన భాగ్యం ఏర్పడింది.

మధ్యమానేరు రిజర్వాయర్ ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం ద్వీపంలా మారింది.

ఈ దృశ్యం భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటోంది. అయితే గుట్ట చుట్టూ రిజర్వాయర్ వెనుక నీరు చేరడంతో స్వామి వారికి నిత్యపూజలు నిలిచిపోవడంతో పాటు భక్తులకు దత్తాత్రేయ స్వామి దర్శనం కరువైంది.

మధ్యమానేరు రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 2016లో వరదవెల్లి గ్రామం ముంపునకు గురైంది. అప్పటి నుంచి ఆలయం ఉన్న గుట్టను బ్యాక్‌వాటర్‌ చుట్టుముట్దింది. దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఉత్సవాలు జరుపుకుంటున్న భక్తులకు,

2016 నుంచి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ముంపునకు గురైనప్పటి నుంచి భక్తులు కొన్ని సందర్భాల్లో బోటు సాయంతో ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.