J.SURENDER KUMAR,
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భారీ ఓట్ల మెజార్టీతో ఓటమి చెందడం స్వయంకృతమా ? అనుచరుల అరాచకాలా ? వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచారా ? అనే చర్చ మొదలైంది. ఈనెల 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార టిఆర్ఎస్ ప్రతిపక్షం లోకి నెట్టిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లా కేటీఆర్, కరీంనగర్, గంగుల కమలాకర్ ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ క్యాబినెట్ మంత్రులుగా కొనసాగారు. ప్రస్తుతం మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, విజయం సాధించగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి చెందారు. ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలలో కోరుట్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు మొదటిసారిగా, డాక్టర్ సంజయ్, జగిత్యాల అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రెండవసారి విజయం సాధించారు.

👉గత ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినా, అపార రాజకీయ అనుభవం ఉన్న కొప్పుల ఈశ్వర్. తెలంగాణ రాష్ట్రంలో 2014లో గెలిచి చీఫ్ విప్ గా, 2018 లో మంత్రిగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ( ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ) ఏకైక మంత్రిగా వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ 22 వేల ఓట్ల మెజార్టీతో ఓటమి చెందడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.
👉వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారినే అక్కున చేర్చుకున్నారు !

2018 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్వల్ప ఓట్లుతో,(441) గెలిచారు. ఈ సందర్భంగా ధర్మపురి పట్టణంలోని ఎస్ హెచ్ గార్డెన్స్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో నాడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.’ నా వెంట ఉన్న కొందరు అనుచరులు, నాయకులు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ సీఎం రిలీఫ్, సబ్సిడీ ట్రాక్టర్ల కోసం అర్హులను తీసుకువస్తే, మా వాళ్లు గొప్పగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అనుకున్నాను, కానీ వారి వద్ద నుంచి కమిషన్ లు, దాబాలో విందు భోజనాలు, కారు కిరాయిలు, వేలాది రూపాయలు వారి నుంచి వసూలు చేస్తున్న విషయం నాకు ఈ ఫలితాల తర్వాత తెలిసింది. అనే మాజీ మంత్రి ఈశ్వర్ అన్నారు.
👉నన్ను ఓడించడానికి ప్రయత్నించడం

బాధాకరమని, నేను మునిగిపోతే ( ఓడిపోతే ) నాతో పాటు వారు మునిగిపోతారు అనే విషయం వారికి తెలియదు కావచ్చు అంటూ బహిరంగంగా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రజలు తన వద్దకు డైరెక్ట్ గా రావాలన్నారు.

👉పనుల కోసం మిమ్మల్ని కమిషన్, డబ్బులు అడిగిన వారిని, చెప్పులతో కొట్టాలని పిలుపునిచ్చారు’ (2018 డిసెంబర్ లో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తం చేసిన ఆవేదన , ఆగ్రహం )

👉మంత్రి గా ధర్మపురి పట్టణ అభివృద్ధికి
వేలాది కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టిన అంశం వాస్తవం. జంబి, పుట్ట బంగారం గద్దెల నిర్మాణం , కూరగాయల, మాంసం, మార్కెట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ సెంట్రల్ లైటింగ్. రైతు వేదిక, పశువైద్యశాల, సబ్ స్టేషన్ నుంచి గోదావరి నది వరకు సిమెంట్ రోడ్డు పనులు ( పాలీ హౌస్ వరకే ఆపివేశారు) గోదావరి నదిలో డ్రైనేజ్ కలవకుండా కోట్లాది రూపాయలతో ప్రత్యేక డ్రైనేజీ నిర్మాణం, భక్తుల కోసం అదనపు వసతి గదుల నిర్మాణ పనులు. అయ్యప్ప గుడి వద్ద బైపాస్ సీసీ రహదారి తదితర చేపట్టిన అభివృద్ధి పనులను ఎవరు కాదనలేరు. ప్రత్యక్షంగా. అగుపిస్తున్నవే.
👉రాజకీయ ఆధిపత్యం కోసమే ఒకరిద్దరి అరాచకాలు !
మంత్రి పేరు చెప్పుకుంటూ, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని భవిష్యత్తులో కీలక రాజకీయ నాయకుడిగా, నాయకులుగా నియోజకవర్గంలో ఎదగాలని, గెలవాలని, అదే పార్టీలో కొనసాగుతున్న ఒకరు ధర్మపురిలో రాజకీయపరంగా బలమైన ఓ సామాజిక వర్గంను, ఆ వర్గం నాయకులు రాజకీయంగా ఎదగకుండా అడ్డంకులు సృష్టిస్తూ, పైశాచిక ఆనందం పొందడం, విభజించు, పాలించు తరహాలో వారిలో వారికి విభేదాలు సృష్టించడం, బలమైన ప్రజాధరణ ఉన్న నాయకుల, యువత పై అక్రమ పోలీస్ కేసులు పెట్టించారు. ఆ సామాజిక వర్గ నాయకులను అవినీతిపరులుగా, ప్రజలలో ముద్ర వేయడానికి చేసిన యత్నాలలో కేవలం ఒక్క శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం కోసం కృషి చేసినా మాజీ మంత్రి ఈశ్వర్ కు ఈ ఓటమి ఉండేది కాదనే చర్చ కొనసాగుతున్నది.
👉స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 15 మంది కౌన్సిలర్ ల్లో 8 మంది టిఆర్ఎస్, 7 ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు విజయం సాధించారు. తమకు భవిష్యత్తులో రాజకీయంగా వారు అడ్డంకులు సృష్టిస్తారని కొందరు, పోటీలో ఉన్న అధికార పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్న కౌన్సిలర్ల అభ్యర్థులను ఓడించడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించి ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్ ఓడించడంలో వారు విజయం సాధించినట్లు చర్చ.
👉దశాబ్దన్నర కాలం క్రితం ఓ ప్రజా ప్రతినిధి కార్యాలయం పై వచ్చిన అవినీతి ఆరోపణలను టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారే అదే పార్టీలో కొనసాగుతున్న కొందరు నాయకులు కలసి జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో విచారణ పేరిట వేధించడం, వారిని మానసిక క్షోభకు గురి చేయడం, దీంతోపాటు తమ మాట జవదాటని అధికారిని ధర్మపురికి బదిలీ చేయించుకుని పట్టణం మీద, రాజకీయ ఆధిపత్యం చలాయించడం, ప్రజలు తమ అవసరాల కోసం అధికారి వద్దకు వెళ్తే ఆ అధికారి ‘మీరు ఫలానా నాయకులతో నాకు ఫోన్ చేయించండి పని చేసి పెడతాను అంటూ చెప్పడం’ స్థానిక పోలీస్ స్టేషన్ , తాసిల్దార్ , విద్యుత్తు, ఎక్సైజ్ , మున్సిపల్ కార్యాలయల లో ఏలాంటి పనులు, జరగాలన్న ఆ నాయకుడు వద్దకు వెళ్లాల్సిన దుస్థితి , అతడి ఆదేశాల మేరకే అధికారులు తమ తమ విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
👉దశాబ్దన్నరకాలంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా
పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను ఆ కార్యాలయ అధికారి ఏలాంటి నోటీసులు జారీ చేయకుండా విధుల నుంచి తొలగించాడు. మమ్మల్ని ఎందుకు తొలగిస్తున్నారు అంటూ ప్రశ్నించిన ఉద్యోగులను మీరు ఫలానా నాయకుడి దగ్గరికి వెళ్లి నాకు ఫోన్ చేయించండి విధుల్లో చేర్చుకుంటాను అన్నట్టు చర్చ. విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రికి మోర పెట్టుకున్న వారిని ఆ అధికారి తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. కొన్ని నెలల క్రితం గత ప్రభుత్వం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది, వీరు విధుల్లో కొనసాగితే ఇక్కడి కాంట్రాక్ట్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
👉ధర్మపురి ఆలయ పరిసరాల గృహాలు, కొన్ని పట్టా భూముల క్రయవిక్రయాలు జరగకుండా, జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీటిని నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక్కడి నివాస గృహాలు, భూములను ప్రభుత్వ స్వాధీన పరుచుకోవడానికి ప్రకటన సైతం జారీ చేశారు. ఆ ప్రాంత ప్రజలు హైకోర్టులో చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ,మానసికంగా , ఆవేదన చెందుతూ ఓట్ల కు గండి కొట్టారనే చర్చ జరుగుతుంది.
👉ధర్మపురి గోదావరి చేపట్టిన పనుల కాంట్రాక్టర్ వద్ద నుంచి సబ్ కాంట్రాక్టు పొందిన కొందరు నాయకులు. తాము చేసిన పని బిల్లులు పొందడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆదాయ నిధులనుండి కాంట్రాక్టర్ కు ₹ 1. 50 కోట్ల రూపాయలు 20 కాంట్రాక్టు సంస్థలకు ఇప్పించి తాము చేసిన పనుల డబ్బులను తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ధర్మపురి ఆలయ బ్యాంకు ఖాతాలో నిలువ లేకుంటే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి ₹50 లక్షలు ధర్మపురి ఆలయానికి అప్పు ఇప్పించి కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లింపులు చేసి తమ వాటాను తాము పొందారు అనే చర్చ జరుగుతుంది. ఆలయ ఆదాయం నుంచి కొంత మొత్తం తెలుగు కళాశాలకు ( స్థానిక నైట్ కాలేజీకి ) కాంట్రాక్టు లెక్చరర్ లకు జీతాల కోసం చెల్లించి ఉంటే నైట్ కాలేజీ మూతపడేది కాదు అనే చర్చ తో పాటు. అధికార పార్టీ నాయకులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదని ఆగ్రహంతో కారు పార్టీ ఓట్లకు గండి కొట్టారు అనే చర్చ బహిర్గతమైనది.
👉ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఆదాయం గల స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2018 నుంచి 2023 డిసెంబర్ మాసం వరకు ( గత నాలుగున్నర సంవత్సరాల కాలంగా) రెగ్యులర్ ఈవో లేరు, 2019 సంవత్సరం నుంచి నేటి వరకు శాశ్వత పాలకవర్గ నియామకం జరగలేదు. అధికార పార్టీ నాయకత్వం ఏ ప్రయోజనం ఆశించి పాలకవర్గాన్ని, ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించలేదో అనే పలు రకాల చర్చ జరుగుతుంది.
👉భయం గుప్పిట ధర్మపురి…
ధర్మపురి పట్టణ తో పాటు పలు గ్రామాల ప్రజలు గత పది సంవత్సరాలుగా భయం గుప్పిట జీవనం కొనసాగించారు అనేది జగమెరిగిన సత్యం. సోషల్ మీడియాలో తమకు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని కొందరు నాయకులు యువకులను పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేసి కేసులు పెట్టి పట్టణం ప్రజలలో, యువతలో భయబ్రాంతులకు గురి చేస్తూ వారు ఇష్ట రాజ్యాంగ ధర్మపురి పట్టణాన్ని ఏలుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
👉ఓ దివ్యాంగుడిని ( కళ్ళు లేని వాడు)
స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిపించి మూఢనమ్మకాల పై పోలీస్ అధికారులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కొందరు నాయకులు. ఎస్పీ, డి.ఎస్.పి కార్యాలయాల నుంచి నీ గురించి విచారణ చేస్తున్నారంటూ ఆ దివ్యగుడిని అతని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణపై పలు రకాలుగా మొదలైన చర్చ తెరాస ఓట్లకు భారీగా గండి పడిందనే చర్చ మొదలైంది.
👉పట్టణంలోనీ ఆసుపత్రి సమీపాన ‘మాతా
శిశు సంరక్షణ కేంద్ర’ నిర్మాణానికి ఓదాత దాదాపు రెండు ఎకరాల స్థలం విరాళంగా ఇచ్చారు. భూమి పూజ జరిగింది. అట్టి నిర్మాణంను పట్టణానికి దూరంగా నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో మరో ప్రభుత్వ భవనం నిర్మించారు. పరిసర ప్రాంతాల్లో ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడు అక్కడ భూములను కొనుగోలు చేయడం, మరో నాయకుడికి ఆక్కడ భూమి ఉండడంతో, భవిష్యత్తులో ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్మాణాలు ఈ ప్రాంతంలో చేపట్టారు అని ప్రశ్నించలేని దుస్థితిని, భయాందోళనను ప్రజల్లో ముందస్తుగానే కలిగించారు అనే ఆరోపణలు ఉన్నాయి.
👉పట్టణంలో రోడ్ల విస్తరణ, సిసి రోడ్ల నిర్మాణం పనులు కాంట్రాక్టర్ ఇష్ట రాజ్యాంగ చేపట్టిన పనులు నాణ్యత పై ప్రశ్నించిన వారిని కొందరు నాయకులు వేధింపులకు, బెదిరింపులకు పాల్పడుతూ కాంట్రాక్టర్ కు వత్తాసు పలకడం గమనారం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి పుష్కర పైలాన్ వరకు నిర్మించిన సిసి రోడ్డు వల్ల మా వ్యాపార సంస్థలలో, ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి అంటూ ఆ ప్రాంతం వారు మొరపెట్టుకున్న కాంట్రాక్టర్ ఫలానా నాయకులతో చెప్పించండి అంటూ యధావిధిగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం ప్రత్యక్ష నిదర్శనం ఈ అంశంలోనూ ఓటర్లు మౌనంగా కారుకు గండి కొట్టారు అనే చర్చ నెలకొంది.
👉 లక్షలాది రూపాయల సబ్సిడీ రుణాలను ఎలాంటి యూనిట్లు పెట్టకుండా బినామీ పేర్లతో కొందరు నాయకులు పొందడం, అధికార పార్టీలో కొనసాగుతున్న తమకు సబ్సిడీ రుణాలు పొందే అర్హత లేదా ? అనే ఆగ్రహం నిరుద్యోగ యువత లో నెలకొంది. వారి ఆగ్రహం ఓట్ల రూపంలో నాయకులకు చూపించారు అనే చర్చ మొదలైంది.

👉ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకవర్గ శాశ్వత ట్రస్ట్ బోర్డుకు ప్రకటన జారీ చేయాల్సిందిగా దేవాదాయ కమిషనర్ ధర్మపురి ఆలయ అధికారిని ఆదేశించినా, ఆలయ అధికారులపై రాజకీయ ఒత్తిడితో ప్రకటన జారీ చేయకుండా అడ్డుకోవడంతోపాటు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీలో కొనసాగుతున్న కొందరు నాయకులు,. కార్యకర్తలను, చురుకైన నాయకులను రాజకీయంగా గుర్తింపు లభిస్తుందనే ఆక్కసుతో ధర్మపురి ఆలయ ధర్మకర్తలుగా, చైర్మన్ గా నోటిఫికేషన్ జారీ చేయకుండా నియామకాలు జరగకుండా రాజకీయపరంగా వారికి గుర్తింపు రాకుండా అనే దురుద్దేశంతో ఓ నాయకుడు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు అనే చర్చ నేపథ్యంలో అధికార పార్టీకి ఓట్లకు భారీగా గండి పడ్డట్టు సమాచారం.
👉గోదావరి నది తీరంలో గల మంగలి గడ్డను పూల తోట చేస్తామంటూ ప్రభుత్వం ద్వారా భూమిని స్వాధీన పంచుకోవడానికి ఉత్తర్వులు జారీ చేయించారు. మంగలి గడ్డపై దాదాపు 30 మంది చిన్న చితక బుట్టి వ్యాపారులు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ బెదిరించడం, తాము ఉపాధి కోల్పోతామంటూ వ్యాపారులు అభ్యర్థించిన, వేడుకున్న అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం ఓటమికి మరో కారణంగా చర్చ. ఎన్నికల లో మంగలి గడ్డ వాసులు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే సమాచారంతో. మంగలి గడ్డను స్వాధీన పరచుకొము, మీ దుకాణాలు తొలగించం అంటూ వారిలో నమ్మకం కలిగించడానికి అక్కడ రోడ్డు పనులు మొదలుపెట్టారు, తమ పట్టా భూముల నుంచి రోడ్డు వేస్తున్నారు అంటూ పట్టాదారులు ఎన్నికల కమిషన్ ఆశ్రయించి తదు పరి ఉత్తర్వులు జారీ చేసే వరకు రోడ్డు నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని కలెక్టర్ ను ఆదేశిస్తూ కమిషన్, ఉత్తర్వులు జారీ చేసింది.
👉దీనికి తోడు పట్టణంలోని అమాయక వృద్ధ రైతులకు చెందిన లక్షలాది రూపాయల విలువ గల వ్యవసాయ భూమినీ బినామీల పేరిట. రిజిస్ట్రేషన్ చేయించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా భారీ సంఖ్యలో పట్టణ ప్రజలు రైతులు తిరుగుబాటు చేయడంతో. భూ అక్రమంగా నిలిచిపోయింది. బినామీ నాయకుడి పై బాధిత రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా నేటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ భూ వివాదం కోర్టులో ఉండడంతో వారికి రైతుబంధు పథకం అందడం లేదు. మాజీ మంత్రి కి ఓట్లు తగ్గడానికి ఇది మరో కారణంగా జనం చెప్పుకుంటున్నారు.
👉కొందరు అధికార పార్టీ నాయకులు, వ్యక్తిగత రాజకీయ కక్షలతో కొన్ని అంశాలలో మాజీ మంత్రి వ్యక్తిగత కార్యదర్శితో అధికారులకు ఫోన్లు చేయిస్తూ ఆ నాయకులు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటూ వైశాచిక ఆనందం పొందారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేధింపుల నేపథ్యంలో కమలాపూర్ కు చెందిన ఓ రైతు విసిగి వేసారి మాజీ మంత్రి ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ముందు వడ్లు పోసి నిరసన తెలిపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన మాజీ మంత్రి ఈ అంశంపై స్పందించ క తన అనుచర గణం చర్యలు తీసుకోకపోవడం పై చర్చ జోరుగా కొనసాగుతున్నది.
👉 కొందరు అధికారులు ప్రోటోకాల్ ను
పాటించకుండా, ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తూ ఒకరిద్దరు నాయకులకే గౌరవ మర్యాదలు ఇవ్వడంతో ప్రజా ప్రతినిధుల అనుచరుగణం, వారి సామాజిక వర్గం ఆగ్రహంతో అధికార పార్టీ ఓట్లకు గండి కొట్టారు అనే చర్చ నెలకుంది.
👉పట్టణంలో ఓ సామాజిక వర్గం సమస్యలు సాధన కోసం సామాజిక వర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి అధ్యక్షుడు ఎన్నికయ్యారు అధికారికంగా ప్రకటన జారీ కావాలి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన అనుచరుడిని అధ్యక్షుడిగా కొనసాగించాలని ఆ సామాజిక వర్గంపై ఒత్తిడి తెచ్చినట్టు చర్చ. వాళ్లు ససేమీ అనడంతో. మాజీ మంత్రి వద్దకు పిలిపించి ఎన్నికైన అధ్యక్షుడుపై ఒత్తిడి తెచ్చి తన అనుచరుడిని అధ్యక్షుడిగా. నియమించి మొదటి సంవత్సర పదవీకాలం పూర్తి చేయించుకున్నాట్టు చర్చ. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన యువత ఆగ్రహంతో మా సామాజిక వర్గ సంఘ ఎన్నికల్లో వారి ఆధిపత్యం ఏమిటి అంటూ ? సైలెంట్ గా కారు పార్టీకి ఓట్లు వేయకుండా తమ ప్రతి కారం తీర్చుకున్నారు అనే చర్చ పట్టణంలో జోరుగా జరుగుతుంది.
సౌమ్యుడిగా, పరోపకారిగా పేరున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భారీ మెజార్టీతో ఓట్లతో ఓటమి చెందడానికి కేవలం ధర్మపురి పట్టణంలోనే ఆ పార్టీకి చెందిన ఒక్కరు ఇద్దరి చర్యల వల్ల ధర్మపురి పట్టణంలో పోలైన దాదాపు తొమ్మిది వేల పైచిలుకు ఓట్లలో 5 వేలకు పైగా ఓట్ల కాంగ్రెస్ పార్టీకి పోల్ కావడం, మండలంలో 5 వేలకు పైగా ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడంతో అధికార పార్టీ శ్రేణులలో అయోమయం నెలకొంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని. వెన్నంటే ఉంటూ నమ్మక ద్రోహం చేయడమా ? లేక అరాచకాలతో తమ నాయకుడిని అవస్థలకు గురి చేయడమా ? భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి వెన్నుపోటు పొడిచారా ? అనే చర్చ ధర్మపురి పట్టణంలో జోరుగా జరుగుతుంది.