మేం పాలకులం కాదు మీ సేవకులం… సీఎం రేవంత్ రెడ్డి !

👉రేపు సీఎం ప్రజా దర్బార్‌ …

J.SURENDER KUMAR,

మేం పాలకులం కాదు, మీ సేవకులం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం' అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎంగా గురువారం ఎనుముల రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రేవంత్​ ఆరు గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం చేశారు.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం – ఆరు గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఆయనతో ప్రమాణం చేయించారు.

ప్రమాణం అనంతరం ఆరు గ్యారెంటీల దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన మాట మేరకు దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక ఉత్తర్వుపై రెండో సంతకం చేసి ఆ దస్త్రాన్ని వేదికపైనే ఆమెకు అందించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్​ రెడ్డి ‘పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణ.
త్యాగాల పునాదులు పై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ లో పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. తెలంగాణ ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటికే ప్రగతిభవన్‌ ఇనుప కంచెలను బద్ధలు కొట్టించాం. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్‌కు రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతా.
రేపు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తాం. రేపు ఉదయం జ్యోతిరావుపూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్‌ ఉంటుంది. మీ బిడ్డగా, మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. సీఎం అని రేవంత్డి స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ​కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
రేవంత్​ ప్రమాణ స్వీకారం అనంతరం మిగతా మంత్రులతోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ప్రమాణం చేయించారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీతక్క, ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్​, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తదితరులు ప్రమాణం చేశారు.