ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి పదవి ?

👉ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ?

J.SURENDER KUMAR,

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి మంత్రివర్గం లో స్థానం ఖరారు అయినట్టు చర్చ.
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, పెండింగ్ మంత్రి పదవులు భర్తీ అంశంపై అగ్ర నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం.

సీనియార్టీ , పార్టీకి విధేయత, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుక అంశం, అధిష్టానం నిర్దేశించిన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం తదితర అంశాలతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో ఆయన ప్రసంగాన్ని జీవన్ రెడ్డి తెలుగులో అనువదించడం, ఎన్నికల సభలోనే రాహుల్ గాంధీ జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించడం, తదితర అంశాలు కేసి వేణుగోపాల్ వద్ద చర్చకు వచ్చినట్లు సమాచారం. జీవన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి మరో ప్రధాన కారణం రానున్న పార్లమెంట్ ఎన్నికలు అనే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.


కొన్ని నెల వ్యవధిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి పార్టీ పక్కా కార్యాచరణ ప్రణాళిక కు రంగం సిద్ధం చేసింది. 17 పార్లమెంటు స్థానాలలో హైదరాబాద్ మినహా 16 స్థానాలకు పీఏసీలో బాధ్యులను నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెండేసి పార్లమెంటు స్థానాలు బాధ్యతలను అప్పగించారు. మిగతా 10 పార్లమెంట్ స్థానాలకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ అసెంబ్లీ స్థానాలు బిజెపి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్, బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల బాధ్యులుగా పిఏసి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే.
దీనికి తోడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై జీవన్ రెడ్డి పోటీచేసి కెసిఆర్ ను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు. కేవలం 15 వేల ఓట్ల మెజార్టీతో నాడు కేసీఆర్ విజయం సాధించారు. దీనికి తోడు ఇటీవల జరిగిన చివరి శాసనమండలిలో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇథ్ నాల్ పరిశ్రమ ఏర్పాటు అంశంపై ప్రజలు తిరుగుబాటు చేయడం, ఆ ఉద్యమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రస్తుత ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నాయకత్వం వహించడం. ఈ అంశాలను అప్పటి మంత్రి కేటీఆర్, మండలి లో మాట్లాడుతూ, ఆ పరిశ్రమ జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు అనే విషయం నాకు తెలియదు. అంటూ ‘ జీవన్ రెడ్డి గారు రాజకీయాల్లో మీరు ఏమి సంపాదించుకోలేదు అనే విషయం నాతోపాటు అందరికీ తెలుసు’ ఎన్నికల తర్వాత పరిశ్రమ ఏర్పాటు గురించి మీరు, నేను, లక్ష్మణ్ కలిసి మాట్లాడదాం అని నాడు మాజీ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం టి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని నియమించినప్పుడు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పలు రకాల మాట్లాడిన, జీవన్ రెడ్డి మాత్రం, సీనియర్, జూనియర్ అనే సమస్య కాదు అని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం శిరోధార్యం అంటూ రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇటీవల ఎన్నికల్లో తన ఓటమిపై జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి నాలుగు అంశాలు కారణం అంటూ వివరించారు. ఒకటి బిజెపి అభ్యర్థి గెలుస్తాడని ఓవర్గం ఓట్లు బీఆర్ఎస్ కు పడడం , నేను గెలిస్తే నూకపల్లిలో అర్హత లేని వారికి ఇళ్ల కేటాయింపు పై విచారణ జరిపిస్తాడని దుష్ప్రచారం, ప్రత్యర్థి డబ్బు పంపిణీ తదితర అంశాలను జీవన్ రెడ్డి వివరించారు. 2019 మార్చ్ మాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా దాదాపు 39 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన జీవన్ రెడ్డి పదవి కాలం 2025 మార్చిలో ముగిస్తుంది.