👉రేపు (శనివారం )ముక్కోటి ఏకాదశి !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో అంగరంగ వైభవంగా జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు, కృషి చేస్తున్నారు.

భారీగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పన , ఏర్పాట్ల కోసం ఆలయ కార్య నిర్వహణాధికారి ముందస్తుగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, కమిషనర్ డి.ఎస్.పి ఎస్ ఐ అభివృద్ధి కమిటీ సభ్యులు సమావేశమై ఏర్పాట్లపై నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉత్తరద్వారం వద్ద తొక్కి సలాట జరగకుండా క్యూలైన్లను, పోలీస్ బందోబస్తు, ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు.

👉ముక్కోటి ఏకాదశి రోజున పూజాది కార్యక్రమాలు!
23న. (శనివారం). తెల్లవారుజామున గం.2-30 నిమిషాలకు లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల మూలవిరాట్లకు మహా కీరాభిషేకం జరుగును.

👉ప్రాతఃకాలం 4-00 గంటలకు..
వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదికపై అశీనులైన ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, నివేదనలు, సప్త హారతులు సమర్పణ, మంత్రపుష్పము, వేదగోష మహా ఆశీర్వచనములు జరగనున్నాయి.
👉పాతకాలం 5-00 గంటలకు..

మంగళ వాయిద్యములతో వేదమంత్రోచనాలతో ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వాములతో వైకుంఠ ద్వార దర్శన పూజ అనంతరం వైకుంఠ ద్వారం తెరవబడును.

👉ఉదయం 8-00 గంటలకు..
ధర్మపురి క్షేత్రంలో ఉత్సవమూర్తుల సేవలు ఊరేగింపు.
👉శేషప్ప కళా వేదికపై..
భక్తి సంగీత విభారి, సంస్కృతిక కార్యక్రమాలు.
👉విద్యుత్ దీపాలంకరణలు..

ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ శిఖరాలు, గోపురాల తోపాటు ఇసుక స్తంభం, రామలింగేశ్వర స్వామి ఆలయం ముఖ ద్వారం తదితర ప్రదేశాల్లో అమర్చిన విద్యుత్తు దీపాలతో ఆలయ ప్రాంగణాలు, క్షేత్ర పరిసరాలు వెలిగిపోతున్నాయి.