👉నిర్దేశించిన సమయంలోనే వైకుంఠ ద్వారం తెరవండి!
👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్..
J.SURENDER KUMAR,
పవిత్రమైన, ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 23 న జరుగునున్న ముక్కోటి ఉత్సవాల నిర్వహణలో అధికారులు సమయపాలన పాటించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆలయ కార్య నిర్వహణ అధికారినీ ఆదేశించారు.
సోమవారం ఆలయ కార్యనిర్వాణాధికారి ఛాంబర్ లో జరిగిన ముక్కోటి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పీఠాధిపతులు, వేద పండితులు, అర్చకులు, నిర్దేశించిన సమయంలోనే స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి, వైకుంఠ ద్వారం తెరవండి అన్నారు. వీఐపీల,ఎమ్మెల్యే, కోసం ఎదురుచూస్తూ ఆలస్యం చేయవద్దు అన్నారు. భగవంతుడు ముందు అందరూ సమానమేనని, భక్తులకు సకాలంలో దర్శన భాగ్యం కలిగించే బాధ్యత కార్యనిర్వహణాధికారిగా మీదే అన్నారు.

క్షేత్రంలోకి రాగానే భక్తులకు ప్రశాంత ఆధ్యాత్మిక చింతన కలిగేలా భక్తి పాటలు సంగీతాన్ని మైకుల ద్వారా ప్రసారం చేయాలని కోరారు. పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆలయం ముందుకు వాహనాలను అనుమతి ఇవ్వవద్దని , ఒకవేళ వయస్సు రీత్యా వివిఐపీలైతే ఆలయం ముందు డ్రాప్ చేసి వాహనాలు దూరంగా పార్కింగ్ చేయాలన్నారు. నా వాహనం, కాన్వాయ్ సైతం నంది విగ్రహం వద్ద పార్కింగ్ చేస్తా అన్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి గదులను ఇవ్వాలని, దాతలు వీఐపీల కోసం వసతి గదులను బ్లాక్ చేయవద్దని ఈవోను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టే బాధ్యత ఆలయ, స్థానిక మున్సిపల్, పోలీస్ యంత్రాంగందే బాధ్యత అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఈవో శ్రీనివాస్ కు స్పష్టం చేశారు.

వైకుంఠ ద్వారం క్యూ లైన్, చేపట్టనున్న ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.