👉నాడు అసెంబ్లీ ప్రోరోగ్ కాకుండా అడ్డుకున్న శ్రీధర్ బాబు !
👉నాడు అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టకుండా ఎత్తులకు పై ఎత్తులు వేశారు !
👉నేడు నాడు అదే మంత్రిత్వ శాఖ !
J.SURENDER KUMAR,
అర్ధాంతరంగా వచ్చి పోయే పదవులు, హోదాల కన్నా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మిన్న అంటూ నాడు మంత్రి శ్రీధర్ బాబు తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మైండ్ బ్లాక్ అయింది.
అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలు కుట్ర పన్ని శ్రీధర్ బాబు, నిర్వహిస్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మారుస్తూ వేసిన ఎత్తుగడ చిత్తు కావడం, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి ఊహించని పరిణామం. 2014 శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీని ప్రోరోగ్ చేసి తెలంగాణ బిల్లు జాప్యానికి కుట్రలను చిత్తు చేసిన మంత్రి శ్రీధర్ బాబు, స్వరాష్ట్రంలో అదే మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులను శ్రీధర్ బాబు చిత్తు చేసిన తీరుతెన్నులు ఇలా…
వివరాల్లోకి వెళితే…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రతి సందర్భంలోనూ అడ్డుకుంటున్న కిరణ్ కుమార్ రెడ్డి 2013 డిసెంబర్ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ప్రారంభానికి ముందు శాసనసభకు రానున్న తెలంగాణ ముసాయిదా బిల్లును జాప్యం చేయడానికి కుట్ర బుద్ధితో అసెంబ్లీ ని ప్రోరోగ్ చేయాల్సిందిగా నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు సీఎం లేఖ రాశారు, అసెంబ్లీ ప్రోరోగ్ అయితే తిరిగి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే నిర్ణయాధికారం సీఎం కిరణ్ కుమార్ రెడ్డిదే. ఈ కుట్రను నాడు శ్రీధర్ బాబు తనదైన శైలిలో అడ్డుకున్నారు. నిబంధనల మేరకు స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనసభ వ్యవహారాల నిర్వహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు వద్దకు ప్రోరోగ్ ఫైల్ పంపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును జాప్యం చేయడానికే ఈ ప్రోరోగ్ అడ్డుపెడుతున్నారనే విషయం జగమెరిగిన సత్యం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా జరుగుతున్న ప్రోరోగ్ కుట్రను గమనించిన మంత్రి శ్రీధర్ బాబు, ఆ ఫైల్ ను తన వద్ద పెండింగ్ లో ఉంచడంతో నాడు అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదు. దీనికి తోడు రాష్ట్రపతి నుంచి వచ్చిన విభజన బిల్లును స్పీకర్ డిసెంబర్ 16న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణపై చర్చ ప్రారంభించాలని స్పీకర్ ను కోరడం, చర్చ మొదలైన కొంతసేపటికి అసెంబ్లీ వాయిదా పడింది . నాడు అసెంబ్లీలో తెలంగాణపై చర్చ ప్రారంభం కాలేదు, అంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచర గణం అనేక ప్రకటన చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై చర్చ మొదలైంది, అంటూ అసెంబ్లీ రికార్డులు, బులిటన్స్, సాంకేతిక నిబంధనల వివరాలతో, శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్ బాబు ప్రచార సాధనలో స్పష్టం చేశారు.
శ్రీధర్ బాబు కట్టడికి కిరణ్ కుమార్ రెడ్డి యత్నం!
అసెంబ్లీ ప్రోరోగ్ , తెలంగాణ బిల్లు పై చర్చ, అంశాల్లో తన రాజకీయ ఎత్తుల ను శ్రీధర్ బాబు చిత్తు చేయడంతో అసెంబ్లీలో తన రాజకీయ ఎత్తులను అడ్డుకుంటున్న శ్రీధర్ బాబును కట్టడి కోసం, పచ్చి సమైక్యవాది శైలజనాథ్ కు శ్రీధర్ బాబు నిర్వహిస్తున్న శాఖను సీఎం అప్పగిస్తూ జనవరి 3న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బులిటన్ విడుదల చేశారు.
వెనక్కు తగ్గని శ్రీధర్ బాబు!
సీఎం కవ్వింపు చర్య నిరసిస్తూ మనస్థాపం చెందిన శ్రీధర్ బాబు తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడగా నాటి కాంగ్రెస్ అగ్ర నాయకులు రామచంద్ర కుంతియా, దిగ్వ జయాసింగ్ , సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ ,తదితరులు రాజీనామా వద్దని శ్రీధర్ బాబును కోరారు. తెలంగాణ మనోభావాలను దెబ్బతీశారు తెలంగాణ పై అసెంబ్లీలో చర్చ మొదలైంది, కాలేదంటూ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ, శ్రీధర్ బాబు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి!
శ్రీధర్ బాబు రాజీనామా చేశారని అంశం వెలుగు చూడగానే సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు, తెలంగాణ వాదులు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దగ్ధం, రాస్తారోకో , ఓయూ జేఏసీ నాయకులు సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సమర్థుడని నా వద్ద ఉన్న వాణిజ్య పనుల శాఖను ఆయన కప్పగించాలని ఆయన ప్రేమలేఖ ( రాజీనామా పత్రం) అందిందని, ఇలాంటివే మరో 13 రాజీనామా లేఖలు తన వద్ద ఉన్నట్టు సీఎం వివరణ ఇచ్చుకున్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ బాబు 2014 జనవరి 12న కరీంనగర్ చేరుకున్న శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ వాదులు ఘనంగా స్వాగతం పలికారు . నాడు నేడు మంత్రి శ్రీధర్ బాబుకు శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సందర్భంగా. నాటి అసెంబ్లీలో జరిగిన సంఘటనలు మననం చేస్తూ…