నా గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటాను !

👉ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

నా గెలుపు కోసం ఎనలేని కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తలను గుర్తుంచుకొని వారి రుణం తీర్చుకుంటానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారి ధర్మపురి కి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాయపట్నం నుండి ధర్మపురి మున్సిపల్ లోని పలు వార్డుల్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

సీనియర్ నాయకుడు జువ్వాడి సూర్యారావు ను తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లి లక్ష్మణ్ కుమార్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యారావు లక్ష్మణ్ కుమార్ కు మిఠాయి తినిపించి సన్మానించి అభినందించారు.

మహిళలు మంగళహారతులతో లక్ష్మణ్ కుమార్ ఘనంగా స్వాగతించారు. బాణ సంచా కాలుస్తూ, యువకులు నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పటేల్ గార్డెన్స్ లో కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మాన సభలో సమావేశంలో పాల్గొన్నారు.

ఆదివారం రాత్రి 11 గంటల వరకు సన్మాన కార్యక్రమం జరిగింది. ముందుగా ధర్మపురి ఆలయ వేద పండితులు అర్చకులు, అధికారులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను సన్మానించి స్వామివారి శేషాస్త్రం చిత్రపటం బహుకరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, నేనే స్వయంగా ప్రతి గడప గడపకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి పేదవారికి అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు