👉జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు!
J.SURENDER KUMAR,
భూ తగాధ విషయంలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ను, దోషులు ఒక్కొక్కరికి ₹ 2000 రూపాయల జరిమాన మరో కేసు పాత కక్షలు నేపథ్యంలో హత్యకు పాల్పడిన ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూర్మపల్లి గ్రామానికి చెందిన పుల్ల పోశాలు, గంగ మల్లయ్యలు తండ్రి కొడుకులు. వీరు గ్రామ శివారులో గల ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉండేవారు. వీరు సాగు చేసుకుంటున్నా భూమి పక్కన భూమి గల అదే గ్రామానికి చెందిన పుల్ల లస్మయ్య, మహేష్ , గంగవ్వ లకు భూమి విషయంలో తగాదాలు ఉండేవి. తగాదాలు విషయంలో ఇరు కుటుంబాలకు గొడవలు, పెద్దల సమక్షంలో పంచాయతీలు సైతం జరిగాయి. సమస్య పరిష్కారం కాకపోవడంతో కోర్టుకు వెళ్లడం జరిగింది. కాగా జనవరి 19 ,2019 రోజున వివాదం గల భూమిలో లస్మయ్య, మహేష్, గంగవ్వలు జెసిబి తో తవ్వుతున్నారు అనే విషయం తెలుసుకొని గంగ మల్లయ్య ,పోషలు పని ఆపడానికి వెళ్లారు. దీంతో కోపోద్రుక్తులైన లస్మయ్య, మహేష్, గంగవ్వ లు గొడ్డలి , ఇనుప రాడ్, కర్రల సహాయంతో గంగ మల్లయ్య, పోషలు పై దాడి చేయడం జరిగింది. తీవ్ర గాయాల పాలైన తండ్రి కొడుకులను కుటుంబీకులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా గంగ మల్లయ్య మార్గమధ్యలో మృతి చెందడు.
మృతుని భార్య అయిన పుల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు రాయికల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిదితులు అయన పుల్ల లస్మయ్య, మహేష్ , గంగవ్వ లను కోర్టులో హాజరు పరిచారు. కేస్ ను విచారించిన జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిదితులకు జీవిత ఖైదు పాటు ఒక్కొక్కరికి ₹ 2000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఈ యొక్క కేస్ లో పీపీ గా మల్లికార్జున్ , ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా రాజేష్ ఇన్స్పెక్టర్ CMS S I G. రాజునాయక్, కానిస్టేబుల్ M. కిరణ్ కుమార్, మరియు కోర్ట్ కానిస్టేబుల్ G. రామకృష్ణ లు నిందితుల కి శిక్ష పడడం లో కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. కేస్ లో నిందితు లకు శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ అభినందించారు.
పాత కక్షలు నేపథ్యంలో హత్య.. నిందితునికి జీవిత ఖైదు.
సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన చెట్‌పల్లి లక్ష్మీరాజంను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన సూర నీలయ్యకు జీవితఖైదు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన చెట్‌పల్లి లక్ష్మీరాజం, సూర నీలయ్యల మధ్య వ్యవసాయ భూమికి వెళ్లే రహదారి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో లక్ష్మీరాజం తండ్రి చెట్‌పల్లి గంగయ్య, అదే గ్రామానికి చెందిన అల్లెపు నర్సయ్యలు ఇద్దరు కలిసి వివాహ పత్రికలు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా సూర నీలయ్య వాహనం తీసుకెళ్లారు. ఈ వాహనం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో లక్ష్మీరాజం తండ్రి గంగయ్యకు గాయాలయ్యాయి. ఈ విషయంలో కూడా సూర నీలయ్య, లక్ష్మీరాజం మధ్య గొడవలు జరిగాయి. ఇది మనసులో పెట్టుకుని 24.01.2021న మధ్యాహ్నం సమయంలో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా సూర నీలయ్య గొడ్డలితో దాడిచేసి లక్ష్మీరాజంను హత్యచేశాడు. దీంతో మతుని కుమారుడు చెట్‌పల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్ సీఐ కష్ణకుమార్ కేసు నమోదు చేసి సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టగా నింధునికి జీవిత ఖైదు శిక్షతో పాటు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఈ యొక్క కేస్ లో అదనపు పీపీ గా మల్లికార్జున్ , ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ కోర్ట్ కానిస్టేబుల్ రామకృష్ణ , మరియు CMS SI G. రాజునాయక్, కానిస్టేబుల్ M. కిరణ్ కుమార్ నిందితునికి కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిదితుడికి శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.