J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శనివారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, లక్ష్మణ్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

2009లో నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో (రిజర్వుడు) 14 సంవత్సరాల తర్వాత. కాంగ్రెస్ పార్టీ అస్తగతం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన లక్ష్మణ్ కుమార్ 2009 నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు. 2009, 2010, 2014, 2018, ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పొందుతూనే ఉన్నారు. 2023 ఎన్నికల్లో చావో రేవో అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కుటుంబ సభ్యులు, కలిసికట్టుగా లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం అహోరాత్రాలు కృషి చేశారు. నియోజకవర్గ ప్రజలు ఓటర్లు కరుణించి అయ్యో పాపం అంటూ లక్ష్మణ్ కుమార్ ను 22 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈనెల 3 నుంచి హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ క్యాంపులో ఉన్న లక్ష్మణ్ కుమార్ రేపు ధర్మపురి కి రానున్నట్టు సమాచారం.

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి గెజిటెడ్ నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.