నేడు మంత్రి నీ.. నాడు మాజీ మంత్రినీ ఓడించిన లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 21692 ఓట్ల మెజార్టీతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్ పై నేడు ( ఆదివారం )విజయం సాధించిన లక్ష్మణ్ కుమార్, దశాబ్దన్నర కాలం క్రితం మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై 3000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా మాజీ మంత్రి మాతంగి నరసయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మణ్ కుమార్ పోటీపడ్డారు. ఎన్నికల్లో మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై లక్ష్మణ్ కుమార్ 3000 ( మూడు వేల) ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తదనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులలో కొంతకాలం పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా కొనసాగారు.