ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే !

👉కాంగ్రెస్ కు కలిసి వచ్చిన పాత పెన్షన్ హామీ!

👉పోలైన పోస్టల్ బ్యాలెట్లు 192471

J.SURENDER KUMAR,

ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ లో ఆయా పార్టీలకు పడిన కోటలో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యత లభించడంతో ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ కే అని చెప్పాల్సి వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పోలైన పోస్టల్ బ్యాలెట్ సంఖ్య 1924781, ఇందులో ఉద్యోగులు 73 శాతం, 27 శాతం 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, కాంగ్రెస్ పార్టీకి 56 శాతం బీఆర్ఎస్ 25 శాతం, బిజెపి 18 శాతం, ఇతరులకు 1 శాతం ఓట్లు వచ్చాయి.


పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన పార్టీకి మాత్రమే ఓట్లను వేయాలనే  ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదం తెలంగాణలో బాగా పని చేసినట్టు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యత తెలుపుతుంది. అధికారంలోకి వస్తే ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) స్థానే పాత పెన్షన్ పథకాన్ని (OPS) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు స్పష్టమైన హామీని ఇచ్చారని వారు పేర్కొన్నారు  కాంగ్రెస్ సర్కారు సాద్యమైనంత త్వరగా మార్పులు తెస్తుందనే ఆశాభావాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు విశ్వసించారు
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా కాలంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకువివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు సంఘ ప్రతినిధులు ప్రధాన పార్టీల నేతలను కలిసి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఓపీఎస్ ను పునరుద్దరించిన విషయాన్ని తెలియజేసి ఇక్కడా హామీని ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు స్పందిచకపోయినా కాంగ్రెస్ మాత్రం మ్యానిఫెస్టోలో హామీని ఇచ్చింది. వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత విధానం చాలా లోప భూయిష్టంగా ఉన్నందున పాత పథకాన్ని తిరిగి తెస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క కూడా తన పాద యాత్రలో ఇటువంటి ప్రకటనే చేశారు


నాయకులు ఇలా హామీ ఇవ్వటం వల్లనే రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు కాంగ్రెసుకు సంపూర్ణ మద్దతును తెలిపారని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు ‘ఓట్ ఫర్ ఓపీఎస్’ నినాదంలో భాగంగా సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు మొత్తము కాంగ్రెసుకు రావడంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 90 శాతానికి పైగా నియోజకవర్గలలో  కాంగ్రెసు ఆధిక్యత కు దోహదపడ్డాయి  కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తన హామీని నిలుపుకొంటుందని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశతో వున్నారు

👉పాత పెన్షన్‌ విధానంతో కలిగే లాభాలు

ప్రభుత్వ హామి ఉంటుంది.
సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్‌ మొత్తం పెంపు
పదవీ విరమణ తర్వాత హెల్త్‌కార్డులు
ఉద్యోగులు పెన్షన్‌ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు.
పెన్షన్‌కు ప్రతినెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉద్యోగి మరణించేంతవరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది.
గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వర్తిస్తుంది.
జీవితాంతం పెన్షన్‌ మొత్తానికి ఢోకా ఉండదు

👉సీపీఎస్‌తో కలిగే నష్టాలు

షేర్‌ మార్కెట్‌ ఆధారిత పెన్షన్‌ కావడంతో ప్రభుత్వ హామి ఉండదు.
ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ఫ్లాన్‌ ఆధారంగా పెన్షన్‌మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు.
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి.
ప్రతినెలా మూలవేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి.
ఉద్యోగులు పదవీవిరమణ చేసేంతవరకు 10 శాతం మాచింగ్‌ గ్రాంట్‌ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది.
పదవీవిరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు.
కుటుంబ పెన్షన్‌ ఇవ్వాల్సి వస్తే ప్రాన్‌ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి  చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో సిపిఎస్ సంఘ నాయకులు ఆర్‌టీఐ చట్టం కింద సీపీఎస్‌ విధానం రద్దు చేసే అధికారం ఎవరిది అని కేంద్రానికి ఒక లేఖ రాస్తే దాని ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టమైన ఉత్తర్వులు రావడం జరిగింది. ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మన భారతరాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఉన్న అర్టికల్‌ 246(3) ప్రకారం, అర్టికల్‌ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సర్వీస్‌ మాటర్స్‌కు సంబంధించి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసికూడా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయకుండా తీర్మానాలు, కమిటీలు, కేంద్రానికి లేఖలు అనే పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు చేసే విధంగా తొందరగా పాత పెన్షన్ పునరుద్ధరణ చెయ్యాలని ఎంతో ఆశతో ఉద్యోగ ఉపాధ్యాయులు వేచి చూస్తున్నారు

ఉమ్మడి కరీంనగర్ మొత్తం ఓట్లు 21734
కాంగ్రెస్ 9890, Brs 4877, Bjp 5779


ఉమ్మడి వరంగల్ మొత్తం ఓట్లు 23856
కాంగ్రెస్ 14945, Brs 4276, Bjp 2476


మహబూబ్ నగర్ మొత్తం ఓట్లు 21141
కాంగ్రెస్ 14130, Brs 4058,Bjp 2234


మెదక్ మొత్తం ఓట్లు 17073,
కాంగ్రెస్ 8168, Brs 4512, Bjp 3525


నిజామాబాద్ మొత్తం ఓట్లు 14194
కాంగ్రెస్ 5459, BRS 3084,BJP 5701


నల్గొండ మొత్తం ఓట్లు 24173
కాంగ్రెస్ 17068, BRS 5097


ఖమ్మం మొత్తం ఓట్లు 20461
కాంగ్రెస్ 14791, BRS 3988