ప్రజా దర్బారులో ఒక్క రోజున 4 వేల దరఖాస్తులు !

👉సీ .ఎం. ఓ కార్యాలయం వెల్లడి…

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన ‘మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్’ లో ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’లో ఒక్కరోజున 4,471 వినతి పత్రాలు వచ్చాయి.

ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున వస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి సోమవారం వరకు మొత్తం 4,471 వినతి పత్రాలు అందాయి. అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్ లకు సంబంధించిన వినతి పత్రాలు ఉన్నాయి. ఈరోజు నిర్వహించిన ‘ప్రజా వాణి’ కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికారవర్గాలు తెలియజేశాయి.

వ్యవసాయ శాఖ పనితీరుపై..

వ్యవసాయ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖా మంత్రి శ తుమ్మల నాగేశ్వర రావు, ఐ.టి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, @TelanganaCS శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తదితరులు హాజరయ్యారు.