ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తాను..

👉ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

J. SURENDER KUMAR,

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని, నియోజక వర్గం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ధర్మపురి శాసన సభ్యులు ఏ. లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సోమవారం ధర్మపురి ప్రయాణ ప్రాంగణం ఆవరణలో మహాలక్ష్మి, చేయూత కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రతీ ఒక్కరికీ అందేలా అమలు పరచాలని అన్నారు.

మహిళలకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసి బస్సులు ఎక్కవ సంఖ్యలో రద్దీ ఉన్న ప్రాంతాల్లో నడిపించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీ పథకాలను అమ్లుచేయనున్న సందర్భంలో రెండు గ్యారంటీ లను ప్రకటించి అమలు చేస్తున్నదని,

అందులో భాగంగా మహిళలు ఉచిత రవాణా, రాజీవ్ ఆరోగ్య శ్రీ లో ₹ 10 లక్షల వరకు వైద్య సేవలు పెంచడం జరిగిందని తెలిపారు. నియోజక వర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు.

ప్రతీ మహిళా, ప్రతీ లబ్దిదారులు ఈ కార్యక్రమాలను సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. అనంతరం జీరో టికెట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పోస్టర్ లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

అనంతరం ఆర్టీసి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ లను అందించి, బస్సులో కొంత దూరం ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నాగలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మి నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి దేవారాజ్,

ఆర్టీసి డిపో మేనేజర్ సునీత, అదనపు DMHO శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ రమేష్, ఎంపిడిఒ లు, సర్పంచులు, ఆశ, ఎఎన్ఎం లు, తదితరులు పాల్గొన్నారు.