👉డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు!
👉జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
J.SURENDER KUMAR,
ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా, పారదర్శకంగా, ప్రజలకు భరోసా కల్పిస్తూ, ముందస్తు సమాచారాన్ని గ్రామాలు, తండాలు, వార్డ్ లలోని ప్రజలకు చెరవేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
ఆదివారం సాయంత్రం జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీ లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాల మేరకు జిల్లా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి జనవరి 6, 2024 వరకు ( డిసెంబర్ 31, జనవరి 1 మినహా) గ్రామాలు, తండాలు, మునిసిపల్ వార్డ్ లలో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమం క్రింద పేద, అర్హులైన కుటుంబాలకు ఆరు గ్యారంటీ లైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ లక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల, చేయూత పథకాల కు ప్రతీ ఇంటి నుండి ఒకే దరఖాస్తు లను స్వీకరించడానికి షెడ్యూల్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంచాయితీ, మునిసిపల్ అధికారులు రూపొందించాలని అన్నారు. ప్రతీ గ్రామం, వార్డ్ లలో గ్రామ సభలను ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలం, టెంట్లు, త్రాగునీరు, తదితర మౌలిక సదుపాయాలు నిర్వహించాలని అన్నారు. ఎనిమిది రోజులలో జిల్లాలోని పేద అర్హులైన కుటుంబాల నుండి నిర్ణీత దరఖాస్తులు తీసుకోవాలని అన్నారు. అందుకు జిల్లా వ్యాప్తంగా విసృత ప్రచారం చేయాలని అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఆర్ గ్యారంటీ లపై ముందస్తుగా వివరించాలని తెలిపారు. ప్రతీ దరఖాస్తులకు రసీదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీ, వార్డ్ లలోని ఇళ్ళ సంఖ్య ఆధారంగా టీమ్ లను ఏర్పాటు చేయాలని, అదనంగా మరో కౌటర్ ఇతర దరఖాస్తులకు ఏర్పాటు చేయాలని, మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కౌంటర్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతీ మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని తెలిపారు. ఆరు గ్యారంటీ లకు ఒక ఇంటికి ఒకే దరఖాస్తు సమర్పించడం, అవసరమైన పత్రాలు జతచేయడం జరగాలనే విషయాలను లబ్ధిదారులకు తెలియ జేయాలని అన్నారు. అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుండి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఆయా గ్రామ సభలు ప్రాంతంలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతీ డివిజన్, మండలం, పంచాయతీ, మునిసిపల్ లకు ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ లు నరసింహ మూర్తి, రాజేశ్వర్, మధు ,జిల్లా మండల అధికారులు, మునిసిపల్ కమీషనర్ లు, తదితరులు పాల్గొన్నారు.