J.SURENDER KUMAR
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన ఉద్యమాల రథసారథి, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ను జగిత్యాల జిల్లా టిజెఎస్ నాయకులు మంగళ వారం హైదరాబాద్ లో కలసి అభినందించారు.
తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతుతో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై, కొన్ని చోట్ల ఓటమికి గల కారణాల పై అమరవీరుల త్యాగాలు, ఉద్యమ కారుల గుర్తింపు తదితర విషయాలపై చర్చించారు.
టిజెఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కేశపాక తరుణ్, నాయకులు గోగుల రాజు తదితరులు కోదండరామ్ ను కలసి శాలతో సన్మానించి అభినందించారు.