రాజి మార్గమే రాజమార్గం – జడ్జి శ్యాం ప్రసాద్ !

J. SURENDER KUMAR ,

ఈ నెల డిసెంబర్ 30న జరగనున్న జరిగే మెగా లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో కక్షిదారులు కోర్టులో ఉన్న వివాదాలలో రాజీ అనుసరించి రాజమార్గం పొందాలని ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి శ్యాం ప్రసాద్ అన్నారు.

మెగా లోక్ అదాలత్ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని, కక్ష దారులకు గ్రామీణులకు అవగాహన కల్పించాలన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి జనరల్ సెక్రటరీ రౌతు రాజేష్ జాయింట్ సెక్రెటరీ బందేల రమేష్ EC మెంబర్ జాజాల రమేష్ న్యాయవాది కస్తూరి శరత్ ధర్మపురి సీఐ రమణ మూర్తి. ఎస్ ఐ దత్తధ్రి. వెల్గటూర్, బగ్గారం పోలిస్ అధికారులతో సమావేశమై చర్చించారు
ఈ సందర్భంగా న్యాయవాదులను, పోలీసు అధికారులను ఉద్దేశించి, జడ్జి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మెగాలోక్ అధాలత్ లో కక్షిదారులు సంయమనం పాటించి రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో కోర్ట్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు