👉ఈనెల 31లోగా పూర్తి చేయండి!
👉ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్!
J.SURENDER KUMAR,
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లను ఇప్పటినుండే సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్వోలతో పార్లమెంటు ఎన్నికల సంసిద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

శాసనసభ ఎన్నికలకు రూపొందించినట్లుగానే పార్లమెంటు ఎన్నికలకు అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికను తయారు చేయాలని సి ఈ ఓ ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఓపివోలుగా వినియోగించు కునేందుకు తక్షణమే వారి డేటాను సేకరించాలని ఆదేశించారు. సెక్టోరల్ అధికారులను గుర్తించి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఇప్పటినుండే వీడియో సర్వేలెన్సు బృందాల గుర్తింపు, ఆయా సెగ్మెంట్ల వారిగా సహాయ వ్యయపరిశీల కుల నియామకం చేపట్టాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు, ఆయా పార్టీలు చేసే ఖర్చులకు సంబంధించి వ్యయ నిర్ధారణకై రేట్ చార్టును ఫైనల్ చేయాలని తెలిపారు. ఈ మొత్తం 9 కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ 31 లోగా అన్ని పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఓటరు జాబితా సవరణలో భాగంగా స్వీకరించిన పెండింగ్లో ఉన్న అన్ని ఫారాలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా సీఈవో పార్లమెంటు ఎన్నికల రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు సమీక్షించారు
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అడనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ లు నరసింహ మూర్తి, రాజేశ్వర్, తహశీల్దార్లు పాల్గొన్నారు.