రాష్ట్రంలో 71.01 పోలింగ్ శాతం నమోదు!

👉 రీ పోలింగ్‌కు అవకాశమే లేదు !

👉ఆదివారం10:30 గంటలకు తొలి రౌండ్ ఫలితం.

👉 రాష్ట్రంలో 1766 లెక్కింపు టేబుళ్లు,

👉131 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్​

👉49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు

👉లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

👉ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్


J.SURENDER KUMAR,

వివిధ జిల్లాల నుండి  అందిన సమాచారం మేరకు  పోలింగ్​ శాతం 71.01 నమోదైనట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలోని 79 నియోజక వర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని వివరించారు. రాష్ట్రంలో 1766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్​ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిందని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్న వికాస్ రాజ్.. 40 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
2018 ఎన్నికలతో పోలిస్తే, 2023లో పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఈ క్రమంలోనే ఎల్లుండి జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.
తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశమే లేదు  ఆదివారం 10:30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు  ప్రకటిస్తామన్నారు. వికాస్ రాజ్ రాష్ట్రంలో గురువారంపోలైన ఓట్ల వివరాల పరిశీలన జరుగుతోందని అన్నారు.
మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అలాగే 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందని వికాస్ రాజ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుందని వెల్లడించారు. మొదటి ఆధిక్యం 10.30 ప్రాంతంలో తెలిసే అవకాశం ఉందని తెలిపారు.  కౌంటింగ్‌ ఏర్పాట్లు జరుగుతాయన్నారు. చిన్న నియోజకవర్గాల్లో ఉదయం 10.30కు తొలిరౌండ్‌ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి టేబుల్​పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని స్పష్టం చేశారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతంలో కంటే ఈ మారు చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. 2018లో 2400 కేసులు ఉంటే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కొందరు మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ప్రతి 10 పోలింగ్‌ కేంద్రాలకు ఒక సెక్టార్‌ అధికారిని పెట్టాం. 4,039 రూట్‌ ఆఫీసర్లు, 1,251 మంది ఫ్లయింగ్‌  స్క్వాడ్‌లు అందుబాటులో ఉంటారు అని వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 3,26,02,799 ఓటర్లు ఉన్నారని  ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు.
వారిలో 16,005 వృద్ధులు, 9,459 దివ్యాంగులు హోం ఓటింగ్ వేశారని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,80,000 పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 610 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా.. 597 మహిళలు, 119 దివ్యాంగులు, 119, యువ ఉద్యోగులు దీనిని నిర్వహించారు. ఆదిమ, చెంచు తెగలు ఓటు హక్కు వినియోగించుకునే విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.
అలాగే 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7591 కేంద్రాల వెలుపల సీసీటీవీ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. థర్డ్ జెండర్ వాళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని వికాస్ రాజ్ వివరించారు.
ప్రతి టేబుల్​పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు . రాష్ట్రంలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం పోలింగ్‌ నమోదైంది.
అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 46.56 శాతం పోలింగ్‌ నమోదైంది. సీవిజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయి. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది వికాస్ రాజ్ వివరించారు.