రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ?

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ అమలు సాధ్య సాద్యాల పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచితూచి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు, పక్కాగా పకడ్బందీగా, అర్హులకు అందేలా కార్యాచరణకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు సమాచారం. వాలంటరీల వ్యవస్థ పంచాయతీ స్థాయిలో నియమించడమా ? పోలింగ్ బూత్ ల వారిగా నియామకాలు చేపట్టడమా? అనే అంశం సీనియర్ ఐఏఎస్ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రాలో అమలవుతున్న ఈ వాలంటరీ వ్యవస్థ పనితీరును అధికారులు పరిశీలిస్తున్నట్లు చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన, ఎంపిక చేసిన పెన్షన్ దారులలో లబ్ధి పొందుతున్న అర్హత లేని వారి వివరాలు. దివ్యాంగులలో ఎంత శాతం ఉంటే పెన్షన్ కు అర్హత కలిగి ఉంటారు. రైతుబంధు, ఒంటరి మహిళ తదితర పథకాలు అర్హులకే చెందుతున్నాయా ? అర్హత లేని వారు లబ్ధి పొందుతున్నారా ? అనే సమాచారం కొంతమేర ప్రభుత్వం వద్ద ఉండడంతో పాటు, వాలంటరీ వ్యవస్థ ద్వారా పక్కా ఆధారాలతో సమాచార సేకరణ కోసం కూడా కావచ్చునే చర్చ. మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీ పరిసరాలను భూములకు సైతం ( ఇంటి స్థలాలకు అనువైన భూములు)కు చెందిన యజమానుల బ్యాంకు ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ కావడం తదితర అంశాల పక్క వివరాల సమాచార సేకరణ కోసం కావచ్చు, వాలంటరీ వ్యవస్థను మాత్రం అమలు ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

119 అసెంబ్లీ నియోజకవర్గాల లో కొన్ని నియోజకవర్గాల లోని మండలాలు ఇతర జిల్లాల్లో ఉండడం తో జిల్లాను పునర్విభజన చేసి ఒక అసెంబ్లీ పరిధి ఒక జిల్లాలో ఉండేలా చర్యలు చేపట్టి వాలంటీర్లను నియమిస్తారా? లేదా వాలంటీర్లను నియమించి జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చేపడతారా ? అనే అంశాల్లో స్పష్టత లేదు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, విద్యార్హత ప్రామాణికంగా. రోస్టర్ విధానంలో ( రిజర్వేషన్ల ప్రాతిపదికన) వాలంటీర్ ఉద్యోగాలు నియామకం చేపట్ట నున్నట్టు సమాచారం. ఈ నియామకాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టడమా ? డీఎస్సీ ద్వారా ఆయా జిల్లాలలో నియామకాలు చేపట్టడమా అనే అంశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు విధివిధానాల ను ఖరారు చేసే యత్నంలో ఉన్నట్టు సమాచారం. దాదాపు లక్షమంది కి పైగా వాలంటీర్ల నియామకంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అర్హులకే అందేలా ? ప్రతిపక్ష రాజకీయ పార్టీల విమర్శలకు తావు లేకుండా పథకాల అమలు కోసం అధికారుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించడం, లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రకటించడం తదితర విధి విధానాలు. రూపకల్పనలో అధికార యంత్రాంగం ఉన్నట్టు సమాచారం. వాలంటరీ వ్యవస్థ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే దాదాపు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు మాత్రం ఉన్నాయి.