రెండు లక్షల క్వింటాల వరి ధాన్యం సొమ్ము పంచుకున్నారు.?

👉రైతుల కష్టార్జితం ₹ 43.9 కోట్ల రూపాయలలో ఎవరి వాటా ఎంత ?

👉రెండు కిలోల వడ్లు సింగిల్ విండో లకు ? నాలుగు కిలోల అధికారులకు, ప్రజాప్రతినిధులకా ?

👉కొనుగోలు అవకతవకలపై ఆందోళనలు చేసిన అరణ్య రోధనలే !

J.SURENDER KUMAR,

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో వరి ధాన్యం కొనుగోలులో అదనంగా రైతుల వద్ద నిర్బంధంగా తూకం వేసి దోచుకున్న 2 లక్షల 9 వేల 196 క్వింటాళ్ల వరి ధాన్యం సొమ్మును సింగిల్ విండోలు , అధికారులు, రైస్ మిల్లర్లు పంచుకున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి.

అదనంగా తూకం వేసిన ఈ ధాన్యం విలువ ₹ 43 కోట్ల 9 లక్షల, 43 వేల 760/- రూపాయలు.
ఈ ధాన్యం సొమ్మును బ్యాంకు ఖాతాలలో జమ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ధాన్యం సొమ్మును సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రైస్ మిల్లర్లకు, నగదు రూపంలో వాటాలు పంచుకున్నట్టు సమాచారం. తాలు, తప్ప, పేరిట కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి తరుగు పేరిట నిర్బంధంగా సేకరించిన వారి ధాన్యం లో క్వింటాల్ కు 6 కిలోల చొప్పున వీరు వాటాలు పంచుకున్నట్టు చర్చ. సింగిల్ విండోలకు రెండు కిలోల చొప్పున,( ఒక్కో సింగిల్ విండోకు దాదాపు 80 లక్షల రూపాయలు) అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిల్లర్లకు నాలుగు కిలోల మొత్తం వరి ధాన్యం సొమ్మును పంపకాలు చేసుకున్నట్టు చర్చ.
వివరాల్లోకి వెళ్తే….
జగిత్యాల జిల్లాలో యాసంగి వరి ధాన్యం ను ప్రభుత్వం 2023 ఏప్రిల్ చివరివారం నుండి 14 జూన్ 14 , వరకు 4,18,392, ( నాలుగు లక్షల పద్దెనిమిది వేల 392 ) మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ను 60393 మంది రైతుల ద్వారా కొనుగోలు చేసింది. ఇందుకోసం జిల్లాలో 415 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో ఐకెపి 144, సింగిల్ విండో 270, మెప్మా ఒక కేంద్రం క్వింటాలు కు @ ₹ 2060/- ధర చొప్పున చెల్లించారు. కొనుగోలు చేసిన వరి ధాన్యంను ప్రభుత్వం 60393 మంది రైతుల ఖాతాలోకి ( పట్టేదారుపాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు ద్వారా ) వారి బ్యాంకు ఖాతాలోకి ₹ 861, 88, 75,200/- ( యెనిమిది వందలు అరువధి ఒక్క కోట్ల, ఏంబై యెనిమిది లక్షల, 75 వేల, 200/-)
జమ చేసింది.

క్వింటాల్ కు కనీసం 6 కిలోల చొప్పున రైతుల నుండి నిర్బంధంగా వసూలు చేసిన వరి ధాన్యం మొత్తం లెక్కించగా దాదాపు 2 లక్షల 9వేల 196 క్వింటాళ్లు. @ ₹ 2060 లెక్కించగా, ₹ 43, కోట్ల, 9 లక్షల, 43 వేల, 760/- రూపాయలు.

ఇట్టి మొత్తం సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి భవిష్యత్తులో ఇబ్బందుల నేపథ్యంలో జిల్లాలోని ఆయా రైస్ మిల్లర్లు తమ మిల్లులకు చేరిన అదనపు వరి ధాన్యము విలువను లెక్కించి. నగదు సొమ్మును ఆయా ప్రాంతంలోని సింగిల్ విండోలకు, వరి ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రాల వారిగా చెల్లించినట్టు సమాచారం.
జిల్లాలో 63 బాయిల్డ్ రైస్ మిల్లులు, 75 రా రైస్ మిల్లులు, 51. సింగిల్ విండోలు ఉన్నాయి.
ఇది ఉండగా జిల్లాలో కొన్ని సింగిల్ విండోలలో ఈ నగదు సొమ్ము పై వివాదం చోటు చేసుకోవడంతో వారు చైర్మన్ పైఅవిశ్వాస తీర్మానంకు రంగం సిద్ధం చేయడంతో ఒక్కో సింగిల్ విండో డైరెక్టర్ కు పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి వారిని సముదాయించినట్టు సమాచారం.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద తాలు తప్ప పేరుతో నిర్బంధంగా నిర్వాహకులు వరి ధాన్యం సేకరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు, రైతులు, ధర్నాలు, ఆందోళన, రాస్తారోకోలు చేసిన నాటి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో, ఆరు కిలోల వరి ధాన్య పంపకం ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఈ వరి ధాన్యం 2023, ఏప్రిల్ జూన్ 14 వరకు కొనుగోలు చేసింది మాత్రమే, కొన్ని సంవత్సరాలు కొనసాగుతున్న భాగవతంలో ఎంతో మొత్తం పంచుకున్నారో అనే చర్చ మొదలైంది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.