శబరిమలలో పోటెత్తిన అయ్యప్ప స్వాములు !

👉దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు!

👉కేరళ గవర్నర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న బిజెపి శ్రేణులు

J.SURENDER KUMAR,

శబరిమల ఆలయంలో రోజురోజుకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అన్ని కూడా రద్దీగా మారాయి. స్వామి దర్శనం కోసం 12 నుంచి 18 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో చాలా మంది స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. అయ్యప్ప స్వాములకు. స్వామివారి దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని బిజెపి శ్రేణులు కేరళలో గవర్నర్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళనకు దిగారు.

కేరళలో ని శబరి కొండలు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. గత నెలలో స్వామి వారి ఆలయం తెరిచినప్పటి నుంచి రోజు రోజుకి అయ్యప్ప స్వాములు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో స్వాములు , భక్తులు శబరిమలకు  వస్తున్నారు. 


ప్రస్తుతం స్వామి వారి ఆలయంలో మండల- మకరవిళక్కు  పూజలు జరుగుతున్నాయి. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 12 నుంచి 18 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు. గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలలో వేచి ఉన్నప్పటికీ అయ్యప్ప దర్శనం కాకపోవడంతో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వాములు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.
కర్ణాటక, ఏపీ, తమిళనాడు , కి చెందిన అయ్యప్ప స్వాములు స్వామి వారిని దర్శించుకోకుండానే పందళంలోని శ్రీ ధర్మ శాస్త్ర ఆలయంలో ఇరుముడి సమర్పించి..అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. పంబ, అపాచీకి మేడ నుంచి శబరిపీఠం వరకూ స్వాములు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
కొండకు వెళ్లే దారులన్నీ కూడా వాహనాలతో నిండి పోయి ఉన్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కూడా భారీగా ట్రాఫిక్‌ జామ్‌  అయ్యింది. ఇప్పటికే చాలా మంది భక్తులు కొండకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంబ వరకు కూడా చేరుకునేందుకు వీలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది రోజుల నుంచి స్వామి వారి కొండకు లక్షకు పైగా భక్తులు శబరిగిరికి వస్తుండడంతో ఇంత తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి రాధాకృష్ణన్‌   తెలిపారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. రోజుకు లక్ష మందికి పైగా స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు దేవస్థానం సిబ్బంది తెలిపారు. దీంతో భక్తులను క్యూలైన్లలో నియంత్రించడం చాలా కష్టం మారినట్లు అధికారులు వివరించారు. గంటల కొద్దీ క్యూలైన్ల వెంట వేచి ఉండలేని భక్తులకు కొందరు బారికేడ్లు  దూకి మరి స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. దీంతో పరిస్థితి చేజారి పోతుందని గమనించిన ఆలయాధికారులు ఆన్‌ లైన్‌ క్యూ బుకింగ్‌ ను తగ్గించారు. స్వాములు వచ్చిన వాహనాలు ఎరుమేలి, పంబా, నిలక్కల్‌, ఎలవుంకల్‌ ప్రాంతాల్లో బారులు తీరి ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్‌ ఆదేశించారు. భక్తుల తాకిడి భారీగా పెరిగినప్పటీకీ దర్శన వేళలు మాత్రం పొడిగించలేమని శబరిమల ప్రధాన అర్చకులు తెలిపారు.