సోదర భావం ప్రేమతత్వం మే క్రిస్మస్ !

ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J. SURENDER KUMAR,

మానవాళిలో సోదర భావం, ప్రేమ తత్వాన్ని బోధించే పవిత్రమైన క్రిస్మస్ ఉత్సవం, ధనిక పేద తారతమ్యం లేని పండగ క్రిస్మస్ అని ధర్మపురి ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి, ధర్మారం, బుగ్గారం, గొల్లపల్లి, ధర్మపురి మండల కేంద్రంల తో, నామాపూర్ తదితర గ్రామంలో చర్చల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కేకలు కట్ చేసారు, ప్రభుత్వ కానుక బీదలకు పంపిణీ చేశారు. ఆయా చర్చిలలో ఫాదర్ లు దైవ ప్రార్థనలు చేసి ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందించారు.


పెగడపల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ పండగ సందర్భంగా CSI చర్చి, నామాపూర్ గ్రామంలో క్రిస్మస్ పండగ సందర్భంగ GMGM చర్చిలో,

ధర్మారం మండల కేంద్రంలో క్రిస్మస్ పండగ సందర్భంగ JPH చర్చిలలో

ఎమ్మెల్యే కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.