J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్థానిక ఎమ్మెల్యే ఆడ్లురి లక్ష్మణ్ కుమార్, ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఫోటా పోటీగా జరిగిన ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ పై 22039 (ఇరువది రెండు లక్షల ముప్పది తోమిధి) ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

గత నెల 30న పోలింగ్ జరగగా ఆదివారం జగిత్యాల్లో వి ఆర్ కె ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంల లోని ఓట్ల లెక్కింపు జరిగింది. నియోజకవర్గంలో 2, 26, 880 ఓటర్లు ఉన్నారు.
1,81,690 మంది ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కు 91,393 ఓట్లు పోలయ్యాయి. బీ ఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వరకు 69,354 ఓట్లు పడ్డాయి.

ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణం పత్రం పొందిన లక్ష్మణ్ కుమార్ ముందుగా ధర్మపురి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు నాయకులు భారీ ర్యాలీగా టపాసులు కాలుస్తూ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
ధర్మపురిలో దండోరా మోగింది !

2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009 లో ఆవిర్భవించిన ధర్మపురి అసెంబ్లీ రిజర్వుడ్ నియోజకవర్గంలో 2009 ,2014, 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, టిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్, పై పోటీ చేస్తూ ఓటమి పొందుతున్నరు. లక్ష్మణ్ కుమార్ గత 14 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 2023 ఎన్నికలు చావో రేవో అని లక్ష్మణ్ కుమార్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు, లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం రాజీలేని కృషి చేశారు.
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు భద్రత!

ధర్మపురి స్వామిని దర్శించుకుని బయటకు వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు ప్రభుత్వం పోలీసు బలగాల భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు ఇద్దరు సాయుధులైన పోలీసులు, మరికొందరు మఫ్టీలో లక్ష్మణ్ కుమార్ భద్రత పర్యవేక్షణ చేపట్టారు.
హై కమాండ్ నుంచి పిలుపు…
లక్ష్మణ్ కుమార్ కు ఏఐసీసీ ఫోన్ కాల్ రావడంతో రాత్రి ధర్మపురి నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు !

ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తాను జీవించి ఉన్నంతకాలం ధర్మపురి ప్రజల రుణం ఏమిచ్చినా ఎంత సేవలు చేసిన తీర్చుకోలేనిది అన్నారు.