వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి !

ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలులో ఏలాంటి ఇబ్బందులు అవకతవకలు జరగకుండా చూడాలని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన పెగడపల్లి మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖల వారీగా ఉన్న ప్రణాళికలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు పరచడంలో మీ వంతు బాధ్యతగా సహకరించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.

ఘన స్వాగతం..


శాసనసభ్యుడిగా ఎన్నికై మొట్టమొదటిసారి పెగడపెల్లి మండల కేంద్రానికి వచ్చిన లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం లభించింది. వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు, మహిళలు, పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. పట్టణంలోని పద్మనాయక వెల్మ ఫంక్షన్ హాల్ లో అభినందన సభ నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల లోపల రెండు పథకాలు ప్రారంభించడం జరిగింది.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తామని అన్నారు. అదేవిధంగా మండల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు జవాబుదారు గా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు.