విద్యుత్ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతోపాటు సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, సింగరేణి సి.ఎం.డి శ్రీ శ్రీధర్, సీపీడీసీఎల్ సి.ఎం.డి శ్రీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సి.ఎం.డి శ్రీ గోపాల్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం


గవర్నర్ డా. తమిళసై సౌందర రాజన్ ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఒవైసీ చేత తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. 
రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.

బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు ₹ 2 కోట్లు!


ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున ₹2 కోట్ల ప్రోత్సాహక చెక్ అందజేసిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం!


శాసనసభ్యులుగా ఎన్నికైన నాయకులతో స్పీకర్‌ శ్రీ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌ రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా ఇతర మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు!


ట్యాంక్ బండ్ సమీపంలోని డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులు.