J. SURENDER KUMAR,
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చోటు కల్పిస్తూ ఓటరు జాబితా పకడ్భందిగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు ధృవీకరణ, ఓటరు జాబితా తయారీ వంటి పలు అంశాలపై ఆయన సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించారు.
👉వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2024 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.
👉ఓటరు జాబితా సవరణ 2024 కు ముందు పోలింగ్ కేంద్రంలో 1450 కంటే ఎక్కువ ఓటర్లు ఉండకుండా పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ చేయాలని, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు జాబితాలో మరణించిన ఓటర్ల వివరాలు తొలగింపు, ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.
👉పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జి.ఐ.ఎస్. ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు.

👉జనవరి 6, 2024న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేసి, జనవరి 22, 2024 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, ఫిబ్రవరి 2, 2024 లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, ఫిబ్రవరి 8, 2024న తుది ఓటరు జాబితా రూపోందించాలని ఆయన స్పష్టం చేశారు.
👉18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
👉రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా రూపకల్పన కీలకపాత్ర పోషిస్తుందని అర్హులైన వారందరికీ తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, జనవరి 1, ఏప్రిల్
జూలై 1, అక్టోబర్ 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన వారు తమ పేరును ఓటరుగా ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అందుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, కోరుట్ల ఆర్డీఓ రాజేశ్వర్, తహశీల్దార్లు కృష్ణ చైతన్య, వరందన్, తదితరులు పాల్గొన్నారు.