👉ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి..
J.SURENDER KUMAR,
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సంజయ్ కుమార్ కు శుభాకాంక్షల ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు..
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కష్టపడి పనిచేశారు. కార్యకర్తలు మానసిక స్టెర్యం కోల్పోవద్దు. అందరికి అందుబాటులో ఉండి, సేవలందిస్తానని జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం పట్ల హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కు రెండుసార్లు అధికారం అప్పగిస్తే ₹ 60వేల కోట్లతో మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ₹ 6లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, తెలంగాణ దశాబ్దకాలం వెనకబడిందని అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ప్రజలకు కేసీఆర్ పట్ల వ్యతిరేకతకు అద్దం పడుతోంది జీవన్ రెడ్డి అన్నారు. కమిషన్ల కక్కుర్తితో నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు.
2009లో ఉమ్మడి రాష్ట్రంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఇల్లు లేని నిరుపేదల కోసం ఇళ్లు నిర్మించాలనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చామని, ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, ఒక్కొక్కరికి 100గజాల స్థలం చొప్పున 4000 మందికి ఇళ్లు కేటాయించామని జీవన్రెడ్డి గుర్తు చేశారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే కాంగ్రెస్కు పేరు వస్తుందనే అక్కసుతో ఇళ్ల నిర్మాణం కనుమరుగు చేసి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే డబుల్ బెడ్ రూం ఇల్లు రద్దుచేస్తారని ప్రచారం చేసి, లబ్దిదారులను భయాందోళనలకు గురిచేశారని ఆరోపించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోకసభ సీట్లను కాంగ్రెస్ గెలుపొందాల్సిన అవసరం ఉందన్నారు. కడియం శ్రీహరి వ్యాఖ్యల్లో కుట్ర కోణం దాగుందని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల శాఖ అనుమతి లేవని పేర్కొన్నారని, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా రుణ సౌకర్యం ఎలా కల్పించారని, అనుమతులు ఎలా మంజూరు చేశారనే అంశాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికి తీసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ లోపం, సాంకేతిక లోపం, నిర్వహణ లోపాలను తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని జీవన్ రెడ్డి అన్నారు
.టీఆర్ఎస్, బీజేపీ అంతర్గ ఒప్పందం కుదర్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చింది, బీజేపీ చీల్చిన ఓట్లతో రాష్ట్రంలో 15 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.