👉 సమర్థవంతమైన విధులు ద్వారానే అద్భుత ఫలితాలు
👉 ఎస్పీ సన్ ప్రీత్ సింగ్,
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ గా ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమ ని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అన్నారు. మంగళవారం స్థానిక సుమంగళి గార్డెన్ జిల్లా పోలీసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది.
సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అధికారుల, సిబ్బంది క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించడం వల్లే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగింది అన్నారు. అవసరమైన ప్రదేశాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసే తనిఖీ లు చేయడం ద్వారా అన్ని రకాల అక్రమ తరలింపులు అడ్డుకోవడం సాధ్యమైందని అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో విధుల ను మరింత సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించిన BSF అధికారులను ఎస్పీ శాలువా పూలమాల తో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ప్రభాకర్ రావు ,భీమ్ రావు , జనార్దన్ రెడ్డి, డిఎస్పి లు రవీంద్ర కుమార్, వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, డి.వి రంగా రెడ్డి, మరియు సి.ఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, BSF అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.