యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కెసిఆర్!

👉ఫామ్ హౌస్ లో గాయపడ్డారు!

J.SURENDER KUMAR,

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అర్ధరాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కింద పడడంతో గాయపడ్డారు. ఆయన ను హుటా హుటిగా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు.

వైద్య నిపుణులు పర్యవేక్షణలో ఆయన గాయానికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బాత్రూంలో కాలు జారి పడ్డట్టు వైద్యులకు కుటుంబ సభ్యులు వివరించారు. కేసీఆర్‌ కాలి తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.