అభిమన్యుడిని కాదు అర్జునుడిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి !

👉భీమిలి ఎన్నికల శంఖారావం సభలో ‘ సిద్ధం’ వేదికగా సీఎం జగన్ !

J.SURENDER KUMAR,
ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని అని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం జరిగిన భీమిలి ఎన్నికల సభలో ‘ సిద్ధం’ వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు.

కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం లా భీమిలిలో కనిపిస్తోంది. కృష్ణుడిలా నాకు కార్య కర్తలు, ప్రజలు అండగా ఉన్నారు. చంద్రబాబుతో సహా కౌరవ సైన్యం అంతా ఓడిపోతుంది. పథకాలు, అభివృద్ధే మన అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు కొట్టడమే మన టార్గెట్’ అని భీమిలి ఎన్నికల సభలో ఉద్ఘాటించారు.


పేద వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు ఏనాడు కృషి చేయలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కి ఓటేస్తామని ఎవరైనా అనగలరా ? పొత్తు లేకుంటే ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకరు. YCP టార్గెట్గా శత్రువులు ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒంటరి పోరాటానికి YCP సిద్ధం. సంక్షేమ పథకాలు రద్దు చేసే గజదొంగల ముఠాను ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు జగన్ !


ప్రతి ఇంట్లో వైసీపీ లబ్ధిదారుడు ఉండటం చూసి 75 ఏళ్ల వయసు మళ్లిన చంద్రబాబు భయపడుతున్నాడని సీఎం జగన్ విమర్శించారు. ‘అందుకే ఒంటరిగా పోటీ చేసే ధైర్యంలేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు. కొత్త వాగ్ధానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు. అంటే ప్రజల్లో వారు లేరని అర్థం. 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా ఈసారి రావని అర్థం. వారికి కనీసం అభ్యర్థులు కూడా లేరు’ అని ఎద్దేవా చేశారు.